తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dhoni And Hardik Dance: హార్దిక్‌, ఇషాన్‌లతో కలిసి డ్యాన్స్‌ చేసిన ధోనీ.. వీడియో వైరల్‌

Dhoni and Hardik Dance: హార్దిక్‌, ఇషాన్‌లతో కలిసి డ్యాన్స్‌ చేసిన ధోనీ.. వీడియో వైరల్‌

Hari Prasad S HT Telugu

28 November 2022, 17:50 IST

    • Dhoni and Hardik Dance: హార్దిక్‌, ఇషాన్‌లతో కలిసి డ్యాన్స్‌ చేశాడు మిస్టర్‌ కూల్‌ ఎమ్మెస్‌ ధోనీ. ఈ వీడియోను హార్దిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా.. అది వైరల్‌ అవుతోంది.
హార్దిక్ పాండ్యాతో కలిసి డ్యాన్స్ చేస్తున్న ధోనీ
హార్దిక్ పాండ్యాతో కలిసి డ్యాన్స్ చేస్తున్న ధోనీ

హార్దిక్ పాండ్యాతో కలిసి డ్యాన్స్ చేస్తున్న ధోనీ

Dhoni and Hardik Dance: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎమ్మెస్‌ ధోనీ స్టెప్పులేశాడు. ప్రస్తుత ఇండియన్‌ టీమ్‌ క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, ఇషాన్‌ కిషన్‌లతో కలిసి బాలీవుడ్‌ పాటలకు డ్యాన్స్‌ చేయడం విశేషం. స్టెప్పులేయడానికి ఇబ్బంది పడుతున్న ధోనీకి హార్దిక్‌ డ్యాన్స్‌ పాఠాలు చెప్పాడు. ఈ వీడియోను సోమవారం (నవంబర్ 28) హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ర్యాపర్‌ బాద్‌షా ఓవైపు పాటలు పాడుతుంటే.. ఈ ముగ్గురూ కలిసి స్టెప్పులేశారు. దుబాయ్‌లో జరిగిన యూకే వ్యాపారవేత్త కుల్జిందర్‌ బహియా బర్త్‌డే పార్టీ వేడుకల్లో క్రికెటర్లు ఇలా ఎంజాయ్‌ చేశారు. ఈ మధ్యే న్యూజిలాండ్‌పై మూడు టీ20ల సిరీస్‌లో ఇండియన్‌ టీమ్‌ను లీడ్‌ చేసిన హార్దిక్‌.. తర్వాత ఇండియాకు వచ్చేశాడు. ఇక్కడి నుంచి బర్త్‌డే పార్టీ కోసం దుబాయ్ వెళ్లాడు.

ఈ పార్టీలో వీళ్లంతా బాగా ఎంజాయ్‌ చేసినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. హార్దిక్‌తోపాటు అతని సోదరుడు కృనాల్‌ కూడా ఉన్నాడు. యూకేలో బహియాకు సౌతాల్‌ ట్రావెల్‌ అనే ఏజెన్సీ ఉంది. ఈ ఏజెన్సీకి 2.55 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ వ్యాపారవేత్త మొత్తం సంపద విలువ 22.7 కోట్ల పౌండ్లు కావడం విశేషం. దీంతో దుబాయ్‌లో అతని బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి.

ఇక ఈ మధ్యే న్యూజిలాండ్‌పై మూడు టీ20ల సిరీస్‌ను ఇండియా 1-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఈ ఏడాది ఐర్లాండ్‌ సిరీస్‌లోనూ ఇండియాను 2-0తో హార్దిక్‌ గెలిపించాడు.

టాపిక్

తదుపరి వ్యాసం