Dhoni in FIFA World Cup: బ్రెజిల్‌ మ్యాచ్‌లో ధోనీ చెన్నై జెర్సీ.. ఫొటో వైరల్‌-dhoni in fifa world cup as a fan of chennai super kings dons msd jersey ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dhoni In Fifa World Cup: బ్రెజిల్‌ మ్యాచ్‌లో ధోనీ చెన్నై జెర్సీ.. ఫొటో వైరల్‌

Dhoni in FIFA World Cup: బ్రెజిల్‌ మ్యాచ్‌లో ధోనీ చెన్నై జెర్సీ.. ఫొటో వైరల్‌

Hari Prasad S HT Telugu
Nov 25, 2022 11:32 AM IST

Dhoni in FIFA World Cup: బ్రెజిల్‌ మ్యాచ్‌లో ధోనీ చెన్నై జెర్సీ కనిపించిన ఫొటో వైరల్‌ అవుతోంది. ఓ అభిమాని ప్రత్యేకంగా ధోనీకి చెందిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జెర్సీతో స్టాండ్స్‌లో కనిపించాడు.

ధోనీ జెర్సీతో బ్రెజిల్, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు
ధోనీ జెర్సీతో బ్రెజిల్, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు

Dhoni in FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో బ్రెజిల్‌ తన తొలి మ్యాచ్‌ ఆడేసింది. సెర్బియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆ టీమ్‌ 2-0తో గెలిచిన విషయం తెలిసిందే. రిచర్లీసన్‌ రెండు కళ్లు చెదిరే గోల్స్‌తో బ్రెజిల్‌ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో మన ధోనీ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు. అలాగని అతడు నేరుగా వెళ్లి మ్యాచ్‌ చూడలేదు.

ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అతని అభిమాని ఒకరు ఉంటారు కదా. అలా ఓ వీరాభిమాని చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌కు చెందిన ధోనీ జెర్సీతో కనిపించాడు. ఓ బ్రెజిల్‌ అభిమానితో కలిసి ధోనీ జెర్సీని చూపిస్తూ సందడి చేశాడు. బ్రెజిల్‌ ఎల్లో, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎల్లో జెర్సీలు ఇలా ఒక్కచోట చేరాయి. ఇప్పుడీ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వరల్డ్‌కప్‌ గ్రూప్‌ జిలో భాగంగా బ్రెజిల్‌, సెర్బియా మ్యాచ్‌ గురువారం (నవంబర్‌ 24) రాత్రి లూసెయిల్‌ స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ధోనీ వీరాభిమాని ఒకరు వచ్చారు. అతడు ధోనీ జెర్సీని పట్టుకొని ఉన్న ఫొటోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఎక్కడికి వెళ్లినా అక్కడ ఎల్లో లవ్‌ కనిపిస్తుందంటూ చెన్నై ఈ స్పెషల్‌ ఫొటోలను షేర్‌ చేసింది.

ధోనీకి వీరాభిమాని అయిన ఈ వ్యక్తి పేరు నబీల్‌. బ్రెజిల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆ టీమ్‌ జెర్సీతోపాటు చెన్నై జెర్సీ కూడా వేసుకొని కనిపించాడు. గతంలో ఓసారి ధోనీని కలిసి అతనితో సెల్ఫీ కూడా దిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ గెలవడం అతని ఆనందాన్ని రెట్టింపు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ స్టార్‌ ప్లేయర్‌ నెయ్‌మార్‌ మడమ గాయానికి గురి కావడం ఫ్యాన్స్‌కు మింగుడు పడటం లేదు. అతని గాయం తీవ్రత ఎంత అన్నది ఇంకా తెలియలేదు.

WhatsApp channel