తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ishan Kishan: నువ్వు ధోనీవి కాదు అన్న ఆకాశ్ చోప్రాకు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన ఇషాన్ కిషన్

Ishan Kishan: నువ్వు ధోనీవి కాదు అన్న ఆకాశ్ చోప్రాకు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన ఇషాన్ కిషన్

Hari Prasad S HT Telugu

03 August 2023, 16:27 IST

    • Ishan Kishan: నువ్వు ధోనీవి కాదు అన్న ఆకాశ్ చోప్రాకు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు ఇషాన్ కిషన్. వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డే సందర్భంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ (AFP)

ఇషాన్ కిషన్

Ishan Kishan: టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు వెస్టిండీస్ టూర్ బాగా కలిసొచ్చింది. మూడు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో గతంలో ధోనీ సాధించిన రికార్డును సమం చేశాడు. మొత్తంగా ఆ వన్డే సిరీస్ లో ఇషాన్ 184 పరుగులు చేయడం విశేషం. ఓ వన్డే సిరీస్ మూడు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన అజర్, వెంగ్‌సర్కార్, ధోనీ సరసన ఇషాన్ నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

అయితే మూడో వన్డేలో అతని బ్యాటింగ్ లో కాకుండా స్టంపింగ్ విషయంలో ధోనీతో పోల్చాడు కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. ఈ సందర్బంగా ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. ఇషాన్ ఓ స్టంపింగ్ చేయగా.. దాని గురించి ఆకాశ్ వివరిస్తూ ధోనీ పేరు ప్రస్తావించాడు.

"స్టంపింగ్, రనౌట్ లను రివ్యూ చేయడం చాలా అరుదు. ఇప్పటి వరకైతే అతని పాదం గ్రౌండ్ పైనే ఉంది. ఇషాన్ నువ్వు కూడా రాంచీ నుంచే వచ్చి ఉండొచ్చు కానీ.. నీ పేరు ఎమ్మెస్ ధోనీ కాదు" అని ఆకాశ్ చోప్రా అన్నాడు. ఆ వెంటనే స్పందించిన ఇషాన్.. హా, ఫిర్ ఠీక్ హై (హా సరే అయితే) అని అనడం స్టంప్ మైక్ లో వినిపించింది.

అది విని పక్కనే ఉన్న మరో ఇద్దరు కామెంటేటర్లు నవ్వారు. ఆకాశ్ కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయాడు. ఆ తర్వాత "ఇషాన్ ఆన్సర్ కూడా ఇచ్చేశాడు.. హౌ స్వీట్ ఇషాన్. వీ లవ్ యూ" అని ఆకాశ్ అన్నాడు. దానికి కూడా ఇషాన్ స్పందిస్తూ.. హా, సరే అయితే అని మళ్లీ అన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

తదుపరి వ్యాసం