తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cheteshwar Pujara: తక్కువ బంతుల్లో పుజారా అదిరే సెంచరీ.. 20 ఫోర్లు, 2 సిక్సర్లు

Cheteshwar Pujara: తక్కువ బంతుల్లో పుజారా అదిరే సెంచరీ.. 20 ఫోర్లు, 2 సిక్సర్లు

23 August 2022, 22:57 IST

    • భారత ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా ఇంగ్లాండ్ క్లబ్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. మిడిల్‌సెక్స్‌పై అతడు 90 బంతుల్లో 132 పరుగులతో రెచ్చి పోయాడు. ఫోర్లు, సిక్సర్లతో విజృంభించాడు.
ఛతేశ్వర్ పుజారా
ఛతేశ్వర్ పుజారా (Twitter)

ఛతేశ్వర్ పుజారా

భారత ఆటగాడు ఛతేశ్వర్ పుజారా పేరు చెప్పగానే.. ఎవరికైనా అతడో టెస్టు ఆటగాడని, బౌలర్ల సహానానికి పరీక్ష పెట్టే నయా వాల్ అని అందరూ భావిస్తారు. అందుకే టీమిండియాకు పూర్తి స్థాయి టెస్టు బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అలాంటి పుజారా బాల్ టూ బాల్ స్కోరు సాధిస్తేనే చాలా వేగంగా ఆడినట్లుగా అనుకోవచ్చు. అలాంటిది ఏకంగా తక్కువ బంతుల్లో టీ20 స్టైల్లో రెచ్చిపోయి ఆడాడు. మంగళవారం నాడు ఇంగ్లాండ్ కౌంటీ జట్లయినా ససెక్స్, మిడిల్‌సెక్స్ జట్ల మధ్య ఓ మ్యాచ్ జరగింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ససెక్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన పుజారా.. తక్కువ బంతుల్లోనే ఏకంగా సెంచరీ బాదేశాడు. అది కూడా 90 బంతుల్లో 132 పరుగులతో రెచ్చి పోయాడు. ఇందులో 20 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 75 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్న పుజారా.. మరో 32 పరుగులు చేయడానికి కేవలం 15 బంతులనే తీసుకున్నాడు. అనంతరం మిడిల్‌సెక్స్ బౌలర్ మ్యాక్స్ హ్యారిస్ బౌలింగ్‌లో ఔటై పెవిలియన్ చేరాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు అతడికి మూడో సెంచరీ. ఫలితంగా ససెక్స్ 400 పరుగులు సాధించింది.

అంతకుముందు వార్‌విక్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 73 బంతుల్లో మెరుపు శతకంతో చెలరేగాడు. అదే విధంగా సుర్రేతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 174 పరుగులతో తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. రాయల్ వన్డే కప్ 2022లో 500 పరుగుల మార్కును దాటిన రెండో బ్యాటర్‌గా పుజారా రికార్డు సృష్టించాడు.

పుజారా ప్రస్తుతం టీమిండియా టెస్టు బ్యాటర్‌గా జట్టులో కీలకంగా ఉన్నాడు. గత నెలలో ఇంగ్లాండ్‌తో జరిగిన రీషెడ్యూల్ ఐదో టెస్టు సందర్భంగా భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అప్పటి నుంచి కౌంటీ క్రికెట్ ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు.

టాపిక్

తదుపరి వ్యాసం