Cheteshwar Pujara: కౌంటీ వన్డేల్లో పుజారా భారీ శతకం - ధనాధన్ బ్యాటింగ్ పై నెటిజన్ల ప్రశంసలు-cheteshwar pujara scores second consecutive century in county odi cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cheteshwar Pujara: కౌంటీ వన్డేల్లో పుజారా భారీ శతకం - ధనాధన్ బ్యాటింగ్ పై నెటిజన్ల ప్రశంసలు

Cheteshwar Pujara: కౌంటీ వన్డేల్లో పుజారా భారీ శతకం - ధనాధన్ బ్యాటింగ్ పై నెటిజన్ల ప్రశంసలు

HT Telugu Desk HT Telugu
Aug 15, 2022 09:07 AM IST

కౌంటీ క్రికెట్ లో వరుస సెంచరీలతో టీమ్ ఇండియా టెస్ట్ స్పెషలిస్ట్ పుజారా (Cheteshwar pujara) సత్తాచాటుతున్నాడు. సర్రేతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో 174 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు.

ఛటేశ్వర్ పుజారా
ఛటేశ్వర్ పుజారా (twitter)

కౌంటీ క్రికెట్ లో ఛటేశ్వర్ పుజారా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. కౌంటీ టెస్ట్ సీజన్ 2022లో టాప్ స్కోరర్ లో ఒకరిగా నిలిచిన పుజారా వన్డేల్లోనూ అదరగొడుతున్నాడు. గత మ్యాచ్ లో కేవలం 79 బాల్స్ లోనే సెంచరీ చేసిన అతడు తాజాగా ఆదివారం జరిగిన సర్రే టీమ్ తో జరిగిన మ్యాచ్ లో 131 బాల్స్ లో 174 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ లో ఐదు సిక్సర్లు, ఇరవై ఫోర్లు ఉన్నాయి. పుజారా మెరుపు బ్యాటింగ్ తో పాటు టామ్ క్లార్క్ సెంచరీ చేయడంతో ససెక్స్ టీమ్ యాభై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 378 రన్స్ చేసింది.

లిస్ట్ ఏ కెరీర్ లో పుజారా వ్యక్తిగత అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ టోర్నమెంట్ లో ససెక్స్ టీమ్ తరఫున హయ్యెస్ట్ స్కోరర్ గా పుజారా నిలిచాడు. 379 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన సర్రే 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో సర్రేపై ససెక్స్ 216 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించింది. భారీ శతకంతో మెరిసిన పుజారాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలతో అదరగొడుతున్నాడని అంటున్నారు. వన్డేలు, టీ20లకు కూడా పుజారాను పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు. వన్డే, టీ20లకు చాలా కాలం క్రితమే దూరమైన పుజారా ప్రస్తుతం టెస్ట్ జట్టులో కీలక బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్నాడు.

WhatsApp channel