తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Harika Pregnancy Journey: హారిక స్ఫూర్తిదాయక వీడియో.. ప్రెగ్నెన్సీ జర్నీని షేర్ చేసిన చెస్ ప్లేయర్

Harika Pregnancy Journey: హారిక స్ఫూర్తిదాయక వీడియో.. ప్రెగ్నెన్సీ జర్నీని షేర్ చేసిన చెస్ ప్లేయర్

19 November 2022, 10:20 IST

    • Harika Pregnancy Journey: ప్రముఖ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక తన సోషల్ మీడియా వేదికగా స్ఫూర్తిదాయకమైన వీడియోను షేర్ చేశారు. తన ప్రెగ్నెన్సీ జర్నీని చూపిస్తూ అందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు.
ద్రోణవల్లి హారిక
ద్రోణవల్లి హారిక

ద్రోణవల్లి హారిక

Harika Pregnancy Journey: భారత చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక ఘనతలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 13 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్‍‌గా ఎదిగిన ఈ తెలుగు తేజం తన కెరీర్‌లో అద్భుత విజయాలను అందుకుంది. అర్జున అవార్డుతో పాటు పద్మశ్రీ కూడా సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో తొమ్మిది నెలల గర్భంతో ఉండి కూడా పతకం సాధించిన తానేంటో నిరూపించింది. ఆ తర్వాత ఆగస్టు 24న ఈ ప్లేయర్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. గర్భవతిగా ఉన్నప్పటికీ నుంచి బిడ్డ పుట్టేంత వరకు గల ప్రయాణాన్ని తాజాగా ఓ రీల్ రూపంలో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

మూడో నెల గర్భిణీగా ఉన్నప్పటి నుంచి బిడ్డ పుట్టేంత వరకు గల తన మజిలీని వివరించింది. ఈ వీడియోను గమనిస్తే మూడో నెలలో ల్యాప్‌టాప్‌లో చెస్ ఆడుతూ కనిపించగా.. 4, 5 నెలల్లో తాను ఎలా ఉందో వివరించింది. అనంతరం ఆరో నెలలోనూ సుదీర్ఘ గంటల పాటు చదరంగా ఆడిన ఫొటోను పంచుకుంది. 7వ నెలలో ఎక్కువ సేపు నడుస్తున్నట్లు.. 8వ నెలలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నట్లున్న ఫొటోలను ఇందులో చూపించింది. 9వ నెలలో ఇండియన్ జెర్సీ ధరించిన తన ఫేవరెట్ దుస్తులుగా వర్ణించింది. అదే నెలలో చెస్ ఒలిపింయాడ్ ఆడాననని, ఎంతో మంది వద్దన్నారని, రిస్క్ అని చెప్పారని అయినా పట్టువదలకుండా పోటీలో పాల్గొన్నట్లు వివరించింది. ఆ ఫలితమే ఆగస్టు 9న చెస్ ఒలింపియాడ్‌లో పతకం అంటూ తెలియజేసింది. చివరకు ఆగస్టు 24న పండండి ఆడపిల్లకు జన్మినిచ్చానని, జీవితంలో అమ్మగా తదుపరి దశకు చేరుకున్నానని వివరించింది.

హారిక పోస్ట్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను గమనిస్తే.. ఆమె ప్రయాణం అందరికీ స్ఫూర్తి నింపేలా ఉంది. మూడో నెల నుంచి తల్లిగా మారేంత వరకు తన మజిలీని షేర్ చేసి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.

మీ చిన్నారి తను ప్రపంచాన్ని చూడకముందే మెడల్ సాధించిందని ఓ యూజర్ స్పందించగా.. చాలా మందికి మీరు స్ఫూర్తిగా నిలిచారని ఇంకో వ్యక్తి పోస్ట్ పెట్టారు. మిమ్మల్ని చూసి గర్వంగా ఉందంటూ మరో వ్యక్తి తమ కామెంట్‌ను తెలియజేశారు. బిడ్డ పుట్టినందుకు మీకు అభినందనలు చెబుతున్నామని, భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుతున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం