తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Australian Open 2024: మొదలైన ఆస్ట్రేలియన్ ఓపెన్.. తొలి రౌండ్‍లో చెమటోడ్చిన జొకోవిచ్.. ఈ టోర్నీ లైవ్ ఎక్కడ చూడొచ్చంటే..

Australian Open 2024: మొదలైన ఆస్ట్రేలియన్ ఓపెన్.. తొలి రౌండ్‍లో చెమటోడ్చిన జొకోవిచ్.. ఈ టోర్నీ లైవ్ ఎక్కడ చూడొచ్చంటే..

14 January 2024, 19:11 IST

    • Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మొదలైంది. తొలి రౌండ్‍లో స్టార్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ చెమటోడ్చి గెలిచాడు. ఈ టోర్నమెంట్ మ్యాచ్‍లను లైవ్ ఎక్కడ చూడొచ్చంటే.. 
Australian Open 2024: తొలి రౌండ్‍లో చెమటోడ్చిన జొకోవిచ్
Australian Open 2024: తొలి రౌండ్‍లో చెమటోడ్చిన జొకోవిచ్ (AFP)

Australian Open 2024: తొలి రౌండ్‍లో చెమటోడ్చిన జొకోవిచ్

Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‍స్లామ్ టోర్నీమెంట్ షురూ అయింది. మెల్‍బోర్న్ వేదికగా ఈ టెన్నిస్ మేజర్ టోర్నీ నేడు (జనవరి 14) మొదలైంది. డిఫెండింగ్ చాంపియన్, సెర్బియా స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ఈసారి కూడా పురుషుల సింగిల్స్‌లో ఫేవరెట్‍గా ఉన్నాడు. కార్లోస్ అల్కరాజ్, మెద్వెదెవ్, జానిక్ సిన్నర్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మహిళల విభాగంలో కాస్త గ్యాప్ తర్వాత నవోమీ ఒసాకా మళ్లీ బరిలోకి దిగుతోంది. ఇగా స్వియాటెక్, అర్యానా సబలెంక, కోకో గాఫ్ ఫేవరెట్లుగా ఉన్నారు. కాగా, నేడు జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‍లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ చెమటోడ్చి గెలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‍లో నొవాక్ జొకోవిచ్ 6-2, 6-7 (5/7), 6-3, 6-4 తేడాతో అన్‍సీడెడ్ క్రొయేషియా ప్లేయర్ డినో ప్రిజ్‍మిక్‍పై విజయం సాధించాడు. అయితే, ఈ మ్యాచ్ గెలిచేందుకు జొకోవిచ్ నాలుగు సెట్ల పాటు పోరాడాల్సి వచ్చింది. రెండో సెట్‍లో ప్రిజ్‍మిక్ హోరాహోరీగా తలపడ్డాడు. ఆ సెట్ ట్రై బ్రేకర్ కాగా.. ప్రిజ్‍మిక్ సొంతం చేసుకున్నాడు. దీంతో జొకోవిచ్‍ చెమటోడ్చాల్సి వచ్చింది. 

రుబ్లేవ్‍కు తప్పిన పరాభవం

పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‍లో నాలుగో సీడ్ జానిక్ సిన్నర్ 6-4, 7-5, 6-3 తేడాతో వాన్ డె జాండ్‍స్కల్ప్ పై సునాయాసంగా గెలిచాడు. వరుస సెట్లలో విజయం సాధించి.. రెండో రౌండ్‍లో అడుగుపెట్టాడు. ఐదో సీజడ్ ఆండీ రుబ్లేవ్ 5-7, 6-4, 3-6, 6-4, 7-6 (10/6) తేడాతో అన్‍సీడెడ్ సెబోత్ వైల్డ్ పై కష్టపడి గెలిచాడు. ఐదు సెట్ల పాటు ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో ఎట్టకేలకు విజయం సాధించాడు. టై బ్రేకర్ వరకు వెళ్లిన చివరి సెట్‍లో చెమటోడ్చి పైచేయి సాధించాడు. దీంతో పరాభవాన్ని తప్పించుకున్నాడు రుబ్లేవ్. మొత్తంగా ఈ మ్యాచ్ 3 గంటల 42 నిమిషాల పాటు జరిగింది.

మహిళల సింగిల్స్ తొలి రౌండ్‍లో నేడు మారియా సక్కారీ 6-4, 6-1 తేడాతో నవో హిబినో అలవోకగా గెలిచింది. కేవలం గంటా 11 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ పూర్తయింది. ప్రత్యర్థిపై సక్కారీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 30వ సీడ్ వాంగ్ క్షిన్యుపై డైన్ పెర్రీ 6-3, 2-6, 6-3 తేడాతో గెలిచింది. రెండో రౌండ్‍లో ఎంటర్ అయింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ తేదీలు

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 టోర్నీ జనవరి 14వ తేదీ నుంచి జనవరి 28వ తేదీ వరకు జరగనుంది. విక్టోరియాలోని మెల్‍బోర్న్ పార్క్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్‍ల టైమ్

ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్ మ్యాచ్‍లు ప్రతీ రోజు భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి జరుగుతోంది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ లైవ్ వివరాలు

ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మ్యాచ్‍లు సోనీ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో ప్రసారం అవుతాయి. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనూ మ్యాచ్‍ల లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

తదుపరి వ్యాసం