తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ab De Villiers: ఆ ముగ్గురి బౌలింగ్ చాలా కష్టం: డివిలియర్స్

AB de Villiers: ఆ ముగ్గురి బౌలింగ్ చాలా కష్టం: డివిలియర్స్

Hari Prasad S HT Telugu

03 July 2023, 16:01 IST

    • AB de Villiers: ఆ ముగ్గురు బౌలింగ్ చాలా కష్టం అని అన్నాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్. మిస్టర్ 360 డిగ్రీగా పేరుగాంచిన ఏబీ కూడా ఇబ్బంది పడిన ఆ ముగ్గురు బౌలర్లు ఎవరో తెలుసా?
ఏబీ డివిలియర్స్
ఏబీ డివిలియర్స్

ఏబీ డివిలియర్స్

AB de Villiers: సౌతాఫ్రికా లెజెండరీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ తెలుసు కదా. ఎలాంటి బౌలర్ అయినా గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతూ.. మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ గా పేరుగాంచాడు. అయితే అలాంటి ప్లేయర్ కూడా ముగ్గురు బౌలర్లను చూసి భయపడ్డాడట. ఈ విషయాన్ని తాజాగా జియో సినిమాలో రాబిన్ ఉతప్పతో మాట్లాడుతూ ఏబీ వెల్లడించాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఆ ముగ్గురిలో ఒకరు మన టీమిండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కాగా.. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్, ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్ లో కూడా తాను ఇబ్బంది పడినట్లు అతడు చెప్పాడు. "2006లో తొలిసారి నేను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు షేన్ వార్న్ బౌలింగ్ లో ఇబ్బంది పడ్డాను. అతని టెక్నిక్, స్కిల్ వల్ల కాదు కానీ.. అంతటి ప్లేయర్ ఉన్నాడన్న ఆలోచనే భయపెట్టింది. నాకు అప్పటికి అనుభవం లేదు. అతని బౌలింగ్ కష్టమే అని అనిపించింది" అని డివిలియర్స్ చెప్పాడు.

"ఆ మ్యాచ్ సులువుగా అనిపించింది. కానీ అతడు చాలా స్మార్ట్. అద్భుతమైన ప్లేయర్. నా బలహీనత వెంటనే గుర్తు పట్టాడు. నేరుగా వచ్చే బంతులను ఎదుర్కోవడం నాకు కష్టంగా ఉండేది. అలాంటి ఓ బంతికే నేను ఔటయ్యాను. 2005, 06, 07లలో నా బలహీనత అదే. ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా వార్న్ బాగా గుర్తించగలడు. నేరుగా వచ్చే బంతిని నేను ఆడలేక మిస్సవుతాను. అప్పుడే అదే జరిగింది" అని ఏబీ తెలిపాడు.

ఆరు ఇన్నింగ్స్ లో నాలుగుసార్లు డివిలియర్స్ ను వార్న్ ఔట్ చేశాడు. ఇక వార్న్ కాకుండా బుమ్రా, రషీద్ బౌలింగ్ కూడా తనకు కష్టంగా తోచిందని డివిలియర్స్ చెప్పాడు. "బుమ్రాతో ఎప్పుడూ సవాలే. ఎందుకంటే అతనిలో పోటీతత్వం ఎక్కువ. వెనక్కి తగ్గేవాడే కాదు. అందుకే అతనంటే, అతడు క్రికెట్ ఆడే తీరంటే నాకు గౌరవం. ఇద్దరి మధ్య మంచి పోటీ ఉండేది. ఒకరిపై మరొకరం పైచేయి సాధించుకునేవాళ్లం" అని డివిలియర్స్ చెప్పాడు.

రషీద్ ఖాన్ గురించి కూడా ఏబీ ఇలాగే చెప్పాడు. అతని బౌలింగ్ లో వరుసగా మూడు సిక్స్ లు బాదినా.. తర్వాతి బంతికి ఔట్ చేయాలని చూసేవాడని డివిలియర్స్ వెల్లడించాడు.

టాపిక్

తదుపరి వ్యాసం