Shane Warne Biopic: షేన్ వార్న్ బయోపిక్.. ఆ సెక్స్ సీన్ చేస్తూ ఆసుపత్రి పాలైన యాక్టర్స్-shane warne biopic shooting going on as actors shifted to hospital after an intimate scene gone wrong ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shane Warne Biopic: షేన్ వార్న్ బయోపిక్.. ఆ సెక్స్ సీన్ చేస్తూ ఆసుపత్రి పాలైన యాక్టర్స్

Shane Warne Biopic: షేన్ వార్న్ బయోపిక్.. ఆ సెక్స్ సీన్ చేస్తూ ఆసుపత్రి పాలైన యాక్టర్స్

Hari Prasad S HT Telugu

Shane Warne Biopic: షేన్ వార్న్ బయోపిక్ తెరకెక్కుతోంది. అయితే ఇందులో భాగంగా ఓ సెక్స్ సీన్ చేస్తూ ఆసుపత్రి పాలయ్యారు యాక్టర్స్. తీవ్ర గాయాలు కావడంతో వాళ్లను హుటాహుటిన ఎమర్జెన్సీకి తరలించారు.

షేన్ వార్న్ పై తెరకెక్కుతున్న మినీ సిరీస్ వార్నీ

Shane Warne Biopic: ఆస్ట్రేలియా లెజెండరీ బౌలర్, గతేడాది మరణించిన షేన్ వార్న్ బయోపిక్ ప్రస్తుతం తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ లో ఓ అపశ్రుతి చోటు చేసుకుంది. షూటింగ్ లో భాగంగా ఓ సెక్స్ చేయబోయి లీడ్ యాక్టర్స్ ఆసుపత్రి పాలయ్యారు. ఈ మూవీలో షేన్ వార్న్ పాత్రలో ఆస్ట్రేలియా నటుడు అలెక్స్ విలియమ్స్ నటిస్తుండగా.. అతని భార్య సిమోన్ పాత్రలో మార్నీ కెన్నెడీ నటిస్తోంది.

ఈ ఇద్దరూ కథలో భాగంగా ఓ సెక్స్ సీన్ లో నటించాల్సి వచ్చింది. అయితే అది కాస్తా గాడి తప్పడంతో వీళ్లను హుటాహుటిన ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అలెక్స్ తలకు గాయం కాగా.. కెన్నెడీ మణికట్టుకు దెబ్బ తగిలింది. అసలు ఆ షూటింగ్ సందర్భంగా ఏం జరిగింది? ఈ ప్రమాదానికి కారణమేంటి అన్న విషయాలను మార్నీ కెన్నెడీ వివరించింది.

"షేన్, సిమోన్ యుక్త వయసులో ఉన్న సమయంలో జరిగే ఓ సెక్స్ సీన్ అది. మేము కారిడార్ లో నడుస్తూ వెళ్తుంటాం. అక్కడి నుంచి బెడ్‌రూమ్ లోకి దూసుకెళ్లి, అక్కడున్న బెడ్ పై పడిపోవాలన్నది సీన్. కానీ మేమిద్దరం బెడ్ పై కాకుండా కింద పడిపోయాం. వెంటనే మా ఇద్దరినీ ఎమర్జెన్సీ రూమ్ కు తరలించారు. అలెక్స్ తలకు బ్యాండేజ్ వేశారు. నాకు మణికట్టు గాయమైంది" అని కెన్నెడీ చెప్పుకొచ్చింది.

అయితే ఇంత తీవ్రమైన ఘటన అయినా, గాయాలు బాగానే తగిలినా.. ఇందులోనూ జరిగిన ఓ సరదా ఘటన గురించి కెన్నెడీ చెప్పింది. మూవీ షూటింగ్ లో భాగంగా ఆ కాస్ట్యూమ్స్ లోనే వాళ్లను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడున్న వాళ్లంతా తమను వింతగా చూశారని కెన్నెడీ తెలిపింది.

షేన్ వార్న్ జీవితంపై తెరకెక్కుతున్న ఈ మినీ సిరీస్ కు వార్నీ అనే టైటిల్ పెట్టారు. షేన్ వార్న్ ను అందరూ ముద్దుగా వార్నీ అని పిలిచే వారు. ఈ సిరీస్ లో వార్న్ జీవితానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలు, క్రికెట్ లో అతడు అత్యున్నత స్థాయికి ఎదిగిన విధానం, వివాదాలను కూడా చూపించనున్నారు. ఇంగ్లిష్ నటి లిజ్ హర్లీతో వార్న్ కు ఉన్న సంబంధం గురించి కూడా ఈ సిరీస్ లో ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.

ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ స్పిన్ బౌలర్లల ఒకడిగా పేరుగాంచిన షేన్ వార్న్ గతేడాది గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. థాయ్‌లాండ్ వెకేషన్ లో ఉన్నప్పుడే అతడు చనిపోయాడు. టెస్ట్ క్రికెట్ లో 708 వికెట్లు తీసిన ఘనత వార్న్ సొంతం.

సంబంధిత కథనం