తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వార ఫలాలు.. ఈ వారం ఈ రాశుల వాళ్ళు గౌరవం, డబ్బు పొందుతారు

వార ఫలాలు.. ఈ వారం ఈ రాశుల వాళ్ళు గౌరవం, డబ్బు పొందుతారు

HT Telugu Desk HT Telugu

21 January 2024, 2:00 IST

    • Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. జనవరి 21 నుంచి 27వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
ఈ వారం రాశి ఫలాలు(21.01.2024 నుంచి 27.01.2024)
ఈ వారం రాశి ఫలాలు(21.01.2024 నుంచి 27.01.2024) (freepik )

ఈ వారం రాశి ఫలాలు(21.01.2024 నుంచి 27.01.2024)

రాశిఫలాలు (వార ఫలాలు) 21.01.2024 నుండి 27.01.2024 వరకు

లేటెస్ట్ ఫోటోలు

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

సంవత్సరం : శోభకృత్‌ నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : పుష్యం

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. భూమి కొనుగోలు చేయడం లేదా భూమి వలన అధిక ఆదాయం కలుగుతుంది. అవనసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. గృహంలో మంగళతోరణాలతో శుభప్రదమైన ఆనందదాయకమైన కలయికలు సంభవిస్తాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలకు కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. మేష రాశి వారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిణి, సుబ్రహ్మణ్యుణ్జి పూజించినట్లయితే మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. అనవసర ఖర్చులకు పోయి నష్టపోకుండా జాగ్రత్త అవసరం. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్త అవసరం. కుటుంబ సమస్యలు మానసిక ఆందోళన ఇబ్బందిపెట్టును. ఉద్యోగస్తులకు పై అధికారులచే ఒత్తిడులు. సుబ్రహ్మణ్య ఆరాధన వలన అష్టమకుజ ప్రభావం నుండి బయటపడవచ్చు. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారంరోజు దుర్గాదేవిని పూజించాలి.

మిథున రాశి

మిథున రాశివారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అధిక లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారులచే ప్రశంసలు పొందుతారు. బంధుమిత్రులతో ఆనందముగా గడుపుతారు. సంతాన విషయంలో అనందం కలుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఆశాజనకంగా ఉంటాయి. మిథున రాశి వారు ఈ వారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. మానసిక శారీరక ఒత్తిళ్ళతో సతమతమవుతారు. గతంలో చేసిన బాకీలు తీర్చగలుగుతారు. వాహనయోగం కలుగుతుంది. సమాజంలో గౌరవస్థానం, విలాసవంతమైప జీవనం కలుగుతాయి. కుటుంబ, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితాలు ఫలించవు. విద్యార్థులకు ఆశించినంత ఫలితం రాకపోవచ్చు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూలముగా ఉంది. కుటుంబముతో ఆనందముగా, ఆహ్లాదంగా గడుపుతారు. దగ్గర ప్రయాణాలు చేస్తారు. మిత్రుల సహకారం ఉంటుంది. గృహ, వాహన సంబంధ అంశాలలో చిన్నపాటి మరమ్మత్తులకు అవకాశం. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటుంది. మంచి పేరు, కీర్తి ఆదాయం పొందుతారు. ఆరోగ్యం అనుకూలించును. సింహ రాశి వారు ఈవారం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభదాయకం. ఉద్యోగస్తులకు పదోన్నతులు. నూతన వస్తు వస్త్ర లాభములుండును. ప్రభుత్వం నుండి లాభాలను పొందుతారు. ధనానికి లోటుండదు. నూతన గృహమందు ప్రవేశించే అవకాశముంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. విద్యార్థులకు అనుకూల సమయం. మహా విష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహతులు మీ విలువను గుర్తించి గౌరవం ఇస్తారు. కుటుంబ సభ్యులతో కలసి పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు. ధైర్యంతో, ప్రణాళికతో అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో బాగా రాణిస్తారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సమాజంలో అరుదైన గౌరవం కలుగుతాయి. ఆర్థికంగా లాభపడతారు. విద్య, ఉద్యోగ విషయాల్లో బాగా రాణిస్తారు. వక్త్యృత్వపు పోటీల్లో పాల్గొనడం. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. గురుదక్షిణామూర్తిని పూజించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పరించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఇబ్బందులు, అధిక ఖర్చులు ఏర్పడును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పై అధికారులచే రాజకీయ ఒత్తిళ్ళు ఇబ్బంది పెడతాయి. శరీర ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. మీ ఇంట అభిమానుల, మిత్రుల సందడి. కార్యజయం కలుగుతుంది. ధనూ రాశి వారు ఈవారం మరింత శుభఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించడం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. వ్యవసాయ లాభాలను అర్జిస్తారు. కొత్త పంటల్లో అధిక లాభాలు పొందుతారు. కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో పదోన్నతులు. అన్నింటా విజయం సాధిస్తారు. మీ పిల్లలకు కళ్యాణాది శుభాలు ప్రారంభమవుతాయి. ఆరోగ్యం అనుకూలించును. విద్యార్థులకు అనుకూల సమయం. వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. వృధా ఖర్చులుంటాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచిస్తున్నాను. రాజకీయ నాయకులకు పరీక్షా సమయం. విద్యార్థులు విద్యలో రాణిస్తారు. విద్యార్థులు కెరీర్‌ గురించి ఆశావహ దృక్పథం అలవర్చుకుని ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం