తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Venus Transit: శుక్ర గ్రహ సంచారం.. 3 రోజుల్లో ఈ రాశుల జాతకులకు అదృష్టం

Venus transit: శుక్ర గ్రహ సంచారం.. 3 రోజుల్లో ఈ రాశుల జాతకులకు అదృష్టం

Gunti Soundarya HT Telugu

15 January 2024, 16:58 IST

    • Venus transit: శుక్ర గ్రహ సంచారంతో మూడు రోజుల తర్వాత కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. శుక్రుడు తన రాశి చక్రం మార్చుకోవడంతో ఈ రాశుల జాతకులు ధనవంతులు కాబోతున్నారు. 
ధనుస్సులోకి శుక్రుడు సంచారం
ధనుస్సులోకి శుక్రుడు సంచారం

ధనుస్సులోకి శుక్రుడు సంచారం

Venus transit: శుక్ర గ్రహం సంపదకి అధిదేవత లక్ష్మీదేవికి సంబంధించినదని నమ్ముతారు. నవ గ్రహాలలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహంగా శుక్ర గ్రహంగా పేర్కొంటారు. అసురుల అధిపతిగా శుక్రుడు ఉన్నాడు. శ్రేయస్సు, అందం, వినోదం, ఐశ్వర్యం, విలాసం, సంపద, ఆరోగ్యానికి ప్రతీకగా చెప్తారు. మూడు రోజుల్లో శుక్రుడు తన రాశి మార్చుకోవడం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. సంపద చేకూరుతుంది. ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. నెలకి ఒకసారి శుక్రుడు రాశి మారనున్నాడు.

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ప్రస్తుతం శుక్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి శుభ స్థానం సంపదని పెంచుతుంది. జనవరి 18న శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు వృశ్చికం నుంచి ధనుస్సులోకి రావడం వల్ల కొన్ని రాశుల వారికి అధ్భుతమైన ప్రయోజనాలు ఇవ్వనున్నాడు. ఒక వ్యక్తికి శుక్రుడు శుభ స్థానంలో ఉండటం వల్ల వారి సంపద పెరుగుతుంది. ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి. శుక్రుడు రాశి మారడం వల్ల ఏయే రాశులకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

కర్కాటక రాశి

శుక్ర సంచారం కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఈ కాలంలో మీకు ఆరోగ్యం బాగుంటుంది. శృంగారభరిత జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ప్రదేశానికి ట్రిప్ కి వెళ్ళే అవకాశం ఉంది. కెరీర్ పుంజుకుంటుంది. కొత్త పనులు దొరుకుతాయి. వృత్తిపరంగా లాభపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. వ్యాపారంలో ఎదురయ్యే ఒడిదుడుకుల నుంచి బయట పడతారు.

మేష రాశి

శుక్రుని సంచారం మేష రాశి వారికి శుభప్రదంగా భావిస్తారు. ఈ సమయంలో మీ శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది. ఇంటి వాతావరణం ఎటువంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ లవర్ తో డేటింగ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు తారసపడతాయి. నిరుద్యోగులకు శుభ సమయం. కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. వారి బంధం బలపడుతుంది.

మకర రాశి

శుక్రుడు రాశి చక్రం మారడం మకర రాశి వారికి లాభ దాయకంగా ఉంటుంది. మీరు పని చేసే ప్రాంతంలో పెట్టుబడి పెట్టేందుకు ఒక మంచి ఒప్పందం లభిస్తుంది. దీని వల్ల మీరు లాభపడతారు. ఆదాయం పెరుగుతుంది. మీ జీవితంలో రొమాన్స్ ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామితో కలిసి హనీ మూన్ ట్రిప్ కి వెళ్ళే అవకాశం ఉంది. ఆస్తి నుంచి డబ్బు పొందే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం