Venus transit: ధనుస్సులోకి శుక్రుడు, ఈ నాలుగు రాశుల వారి జీవితంలో పెను మార్పులు-venus enters into dhanu rashi all zodiac signs effects ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Venus Transit: ధనుస్సులోకి శుక్రుడు, ఈ నాలుగు రాశుల వారి జీవితంలో పెను మార్పులు

Venus transit: ధనుస్సులోకి శుక్రుడు, ఈ నాలుగు రాశుల వారి జీవితంలో పెను మార్పులు

Gunti Soundarya HT Telugu

Venus transit: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. శుక్రుడు రాశి మారడం వల్ల కొన్ని రాశుల వాళ్ళు ధనవంతులు అయితే మరి కొన్ని రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.

శుక్రుడు సంచారం వల్ల ఇబ్బందులు పదే రాశులు ఇవే (Pixabay)

Venus transit: గ్రహాల కదలికలు మారడానికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అసురుల అధిపతి శుక్రుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. డిసెంబర్ 25 నుంచి వృశ్చిక రాశిలో ఉన్న శుక్రుడు జనవరి 18, 2024 నుంచి ధనుస్సులోకి ప్రవేశించబోతున్నాడు. ధనస్సు రాశిలో శుక్రుడు ప్రవేశం కొన్ని రాశుల వారికి శుభం, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇవ్వనుంది. శుక్రుడు ధనస్సు రాశిలోకి రావడం వల్ల కొన్ని రాశుల జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మేషం నుంచి మీన రాశి వరకు ఎవరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం.

మేష రాశి

ధనుస్సు రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురుకాబోతున్నాయి. ఇంట్లో తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెళ్ళిన ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కానీ వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మీ స్నేహితుడి నుంచి మీకు మద్దతు లభిస్తుంది.

వృషభ రాశి

కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి మార్గం సుగమం అవుతుంది. అధికారుల అండదండలు మీకు లభిస్తాయి. పని చేసే చోట గౌరవం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.

మిథునం

కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారాలు చేసే వారి పరిస్థితిలో పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మతపరమైన కార్యక్రమాల్లో బిజీగా మారిపోతారు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వాహన నిర్వహణ, దుస్తులపై ఖర్చులు పెరుగుతాయి.

కర్కాటకం

మనసు చంచలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. ఉద్యోగం చేసే చోట అధికారుల మద్దతు లభిస్తుంది. కానీ పని ప్రాంతంలో మార్పు ఉండవచ్చు. కుటుంబంతో కలిసి ధార్మిక ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంది.

సింహ రాశి

మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది. అకడమిక్ పనిలో విజయం సాధిస్తారు. రాజకీయ నాయకుడిని కలుస్తారు. స్నేహితుల సాయంతో వ్యాపార అవకాశాలు లభిస్తాయి. స్నేహితులతో కలిసి విదేశాలకు విహార యాత్రలకు వెళతారు.

కన్య

మానసిక ప్రశాంతతను కాపాడుకోండి. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. పని పరిధి పెరుగుతుంది. కుటుంబం మొత్తం ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల రాశి

మనసు సంతోషంగా ఉంటుంది. ఉన్నత విద్య కోసం వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉంటాయి. పై పరిధి పెరుగుతుంది. అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది.

వృశ్చికం

శుక్రుడు ఈ రాశిలో నుంచి ధనస్సులోకి వెళతాడు. ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. పని పెరుగుతుంది కానీ మీరు కుటుంబానికి దూరంగా మరొక ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. అధికారుల సహకారం పొందుతారు. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలి. పనుల్లో ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంది.

ధనస్సు రాశి

పాత స్నేహితులను కలుసుకుంటారు. మిత్రుల సహాయంతో ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారం విస్తరించుకునేందుకు అనువైన సమయం. తోబుట్టువుల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది. మేధోపరమైన పనుల్లో బిజీగా గడుపుతారు. సంపాదన పెరుగుతుంది.

మకర రాశి

జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. తల్లిదండ్రుల మద్దతు మీకు ఉంటుంది. కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది కానీ పని ప్రాంతంలో మార్పు ఉంటుంది. ఆస్తి నుంచి డబ్బు పొందే అవకాశం ఉంది.

కుంభం

మీకు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది.

మీనం

కుటుంబంలో తలెత్తిన సమస్యల్ని పరిష్కరించేందుకు శ్రద్ద పెట్టండి. ఉద్యోగ మార్పుకి అవకాశాలు ఉన్నాయి. పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. కుటుంబంలో సంతోషం తగ్గుతుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.