తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Transit: బుధుడు సంచారం.. ఈ మూడు రాశులకి లాభమే లాభం

Mercury transit: బుధుడు సంచారం.. ఈ మూడు రాశులకి లాభమే లాభం

Gunti Soundarya HT Telugu

30 January 2024, 10:32 IST

    • Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు రాశి మార్చుకోబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశులకి శుభం చేకూరనుండగా, మరికొన్ని రాశులకి చెడు ప్రభావం పడనుంది. అటువంటి వాళ్ళు బుధ దేవుడిని సంతోషపరిచేందుకు ఈ పరిహారాలు పాటించి చూడండి. 
బుధ గ్రహ సంచారంతో అదృష్టం పొందే రాశులు ఇవే
బుధ గ్రహ సంచారంతో అదృష్టం పొందే రాశులు ఇవే

బుధ గ్రహ సంచారంతో అదృష్టం పొందే రాశులు ఇవే

Mercury transit: ఫిబ్రవరి నెలలో నాలుగు పెద్ద గ్రహాలు తమ రాశి చక్రాన్ని మార్చుకోబోతున్నాయి. ఇది 12 రాశులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాల రాకుమారుడు బుధుడు ఫిబ్రవరిలో రాశి చక్రం మార్చుకోబోతున్నాడు. ఫిబ్రవరి నెల 1వ తేదీ బుధుడు ధనుస్సు రాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

సనాతన ధర్మంలో బుధ గ్రహాన్ని తెలివితేటలు, ఏకాగ్రత, తర్కం, స్నేహం, వ్యాపారం వంటి వాటికి కారకుడిగా భావిస్తారు. జాతకంలో బుధ గ్రహం స్థానం బలంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి తెలివితేటలు, విచక్షణ పెరుగుతుంది. అదే విధంగా బుధుడు స్థానం బాలహీననంగా ఉంటే వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫిబ్రవరి 1 న బుధుడు రాశి మార్చడం వల్ల కన్యా రాశి, తుల, మకర రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి.

కన్యా రాశి

బుధుడు రాశి మార్పు కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇది ఇంట్లో సంతోషాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి. అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఇది అనువైన సమయం. ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

తులా రాశి

తులా రాశి వారికి బుధ సంచారం లాభదాయకంగా మారుతుంది. భూమి, వాహన సౌఖ్యం పొందుతారు. వృత్తి జీవితంలో కోరుకున్న విజయాలు సాధిస్తారు. పూర్వీకుల ఆస్తి నుంచి ధన లాభం పొందుతారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. తోబుట్టువులతో జరుగుతున్న ఆర్థిక వివాదాల నుంచి బయట పడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

మకర రాశి

బుధుడు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో ఈ రాశి వారికి సంపద పెరుగుదలకి కొత్త అవకాశాలు లభిస్తాయి. నూతన ఆదాయ మరఘాలు మీకు లాభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మంచి వాతావరణం నెలకొంటుంది. ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వస్తు సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయట పడి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

బుధుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారకు కష్ట కాలం మొదలు కాబోతుంది. బుధుడు సంచారం వల్ల ఏయే రాశుల వారికి ఇబ్బందులు ఎదురవుతాయో చూద్దాం..

కర్కాటక రాశి

మకర రాశిలో బుధ సంచారం కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా పరిగణించబడదు. వీరి ఆర్థిక జీవితంలో మార్పులు ఉంటాయి. నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ధనుస్సు రాశి

బుధుడి రాశి మార్పు ధనుస్సు రాశి వారికి అశుభంగా మారనుంది. ఆర్థిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. జీవితంలో అనేక సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తిలో సహోద్యోగులతో విభేదాలు ఏర్పడవచ్చు. పనులు పూర్తి చేయడంతో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

బుధ గ్రహ పరిహారాలు

బుధ గ్రహ స్థానం బలోపేతం చేసేందుకు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల రాబోయే సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఓం ఆయే శ్రీం శ్రీం బుధే నమః, ఓం బ్రహ్మం బ్రిమ్ బ్రౌన్ సా బుధాయ నమః అనే మంత్రాలు జపించండి. ఇలా చేయడం వల్ల బుధుడు అనుగ్రహం లభిస్తుంది. ఆలగే బుధువారం ఆకుపచ్చని కూరగాయలు లేదా ధాన్యాలని దానం చేయడం వల్ల బుధ దేవుని అనుగ్రహం పొందుతారు. బుధ గ్రహం అశుభ ప్రభావాలను తగ్గించేందుకు బుధవారం ఆవుకి పచ్చగడ్డి తినిపించండి. ఇలా చేస్తే బుధుడు సంతోషిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.

తదుపరి వ్యాసం