తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  డిసెంబరు 12, 2023: నేటి రాశి ఫలాలు.. వీరికి గృహ కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి

డిసెంబరు 12, 2023: నేటి రాశి ఫలాలు.. వీరికి గృహ కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి

HT Telugu Desk HT Telugu

12 December 2023, 4:05 IST

    • Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 12.12.2023 మంగళ వారం కోసం పంచాంగకర్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 12.12.2023 మంగళ వారం
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 12.12.2023 మంగళ వారం (pixabay)

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 12.12.2023 మంగళ వారం

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 12.12.2023

లేటెస్ట్ ఫోటోలు

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

మే 14, రేపటి రాశి ఫలాలు.. రేపు శత్రువుల నుంచి వీరికి ఆర్థిక లాభాలు

May 13, 2024, 08:09 PM

Rahu transit: రాహు గ్రహ అనుగ్రహం.. 2025 వరకు ఈ రాశుల వారికి దేనికి ఢోకా లేదు

May 13, 2024, 06:27 PM

వారం: మంగళవారం, తిథి: అమావాస్య, 

నక్షత్రం: అనూరాధ, మాసం: కార్తీకం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

మేషరాశి

మేష రాశి వారికి నేటి రాశి ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆదాయం కొంత పెరిగినా అవసరాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. పలుకుబడి, ఉన్నతస్థితి కలిగినవారు పరచయమవుతారు. శత్రువులను సైతం ఆదరిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులు ఉత్సాహంగా ముందుకు సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు దక్కే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

వృషభరాశి

వృషభ రాశి వారికి నేటి దిన ఫలాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పదవులు రావచ్చు. ఇంటి నిర్మాణ ప్రయత్నంలో అవాంతరాలు తొలగుతాయి. స్థిరాస్తి విషయంలో ఒడిదుడుకులు తొలగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. సమస్యల పరిష్కారంలో సోదరుల సలహాలు తీసుకుంటారు. వాహనాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలుచేస్తారు. నూతన ఉద్యోగావకశాలు రావచ్చు. వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండును. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆత్మీయులు, బంధువులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు అనుకూలం. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు ఉండును. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందవచ్చు. కుటుంబములో వివాహాల విషయంలో చర్చలు నడుస్తాయి.. ఇంతకాలం పడిన కష్టం ఒక కొలిక్కి వస్తుంది. ఆశించిన ఆదాయం లభిస్తుంది. దీర్హకాలిక రుణ ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థుల ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకరమైన రీతిలో కార్యాలు చక్కదిద్దుతారు. మరింత శుభ ఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరుడిని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

సింహరాశి

సింహరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నవి. విద్యార్థులు, ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు మరింత పెరుగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు దక్కుతాయి. ప్రత్యర్థులు అనుకూలురుగా మారి సాయపడతారు. వాహన, గృహ కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కన్యారాశి 

కన్యారాశి వారికి నేటి రాశి ఫలాలు మధ్యస్తం నుంచి అనుకూలంగా ఉన్నవి. ఎవరి సాయం లేకుండానే ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు గౌరవం కలుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో కొత్త ఒప్పందాలు జరుగుతాయి. వ్యాపారులు అనుకున్న సమయానికి విస్తరణ పూర్తిచేస్తారు. పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగులు విధి నిర్వమణలో ఆటంకాలు అధిగమిస్తారు. విద్యావకాశాలు పెరుగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

తులారాశి 

తులారాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధన లాభాలు ఉండవచ్చు. మనసులోని భావాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు హోదాలు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మరింత శుభ ఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి నేటి రాశి ఫలాలు అనుకూలంగా ఉన్నాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తుల వ్యవహారాల్లో గందరగోళం తొలగుతుంది. వివాహాది వేడుకల నిర్వహణ యత్నాలు ముమ్మరం చేస్తారు. మీ నిర్ణయాలు అందరి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు. సన్నిహితులతో సఖ్యత. ఆదాయం మెరుగుపడి ఊరట లభిస్తుంది. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ఉద్యోగులకు హోదా లభిస్తుంది. న్యాయవాదులకు అనుకూల సమయం. మరింత శుభఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

ధనూ రాశి 

ధనూరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తిచేస్తారు. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలకు హాజరవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. గృహం కొనుగోలు, నిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగవకాశములు. వ్యాపారులు మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు లభించే వీలుంది. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. నేర్పుతో కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ముఖ్య కార్యాలు దిగ్విజయం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పదవులు. సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది. 

కుంభ రాశి 

కుంభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు సాధిస్తారు. ప్రముఖులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు, ఉద్యోగులకు కొత్త పదవులు లభిస్తాయి. మరింత శుభ ఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుడిని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మీన రాశి 

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. అందరికీ ఆదర్భంగా నిలుస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. వాహనాలు, భూముల కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న ఉన్నత పదవులు లభిస్తాయి. క్రీడాకారులకు మంచి గుర్తింపు. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

తదుపరి వ్యాసం