సంకట నాశన గణేశ స్తోత్రం.. రోజూ 4 సార్లు చదివితే కష్టాల నుంచి విముక్తి
సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతి నిత్యం నాలుగు సార్లు చదివితే ఎంతటి సంకటమైనా హరించుకుపోతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు జూన్ 7, 2023న సంకట నాశన గణేశ చతుర్థి. అందువల్ల మీరూ ఆ గణేశుడిని ప్రార్థించండి.
సంకటం అంటే కష్టం. నాశనం అంటే నాశనం చేయడం. అంటే మనకు వచ్చే కష్టాన్ని నాశనం చేయడానికి, మనం చేసే పనుల్లో విఘ్నాలు తొలగడానికి ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించాలి. ఆ శ్లోకాల్లో ముందు వరుసలో ఉండేది సంకట నాశన గణేశ స్తోత్రం. ప్రతి రోజూ ఈ స్తోత్రాన్ని నాలుగు సార్లు చదివితే మీ సకల కష్టాలు తొలగిపోతాయి. మీ ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఎంతటి కష్టాన్నైనా బుద్ధిబలంతో జయించే శక్తి సమకూరుతుంది.
సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతి సంకష్టి (సంకటహర) గణేశ చతుర్థి రోజు తప్పకచదవండి. ఆ వినాయకుడి కృపకు పాత్రలు కండి.
సంకట నాశన గణేశ స్తోత్రం
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్
భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్
నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్
సంకట నాశన గణేశ స్తోత్రం సమాప్తం. ఈ స్తోత్రాన్ని ప్రతి రోజూ 4సార్లు చదవండి. గణేషుడి ఆశీస్సులు పొందండి.