తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sankranti Significance : మకర సంక్రాంతి రోజు చేయాల్సిన పనులు, దానధర్మాలు ఇవే..

Sankranti Significance : మకర సంక్రాంతి రోజు చేయాల్సిన పనులు, దానధర్మాలు ఇవే..

14 January 2023, 10:00 IST

    • Sankranti Significance : మకర సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ. 2023లో జనవరి 15వ తేదీన మకర సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటున్నారు. అయితే సంక్రాంతి రోజు చేయాల్సిన పనులు.. ఇవ్వాల్సిన దానధర్మములు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి స్పెషల్
సంక్రాంతి స్పెషల్

సంక్రాంతి స్పెషల్

Sankranti Significance : కాలానికి సనాతన ధర్మంలో చాలా ప్రాధాన్యత ఉన్నది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కాలాన్ని సూర్య చంద్ర, నక్షత్రాల ఆధారంగా లెక్కిస్తారు. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేటటువంటి కాలమును రవి సంక్రమణం అని జ్యోతిష్యశాస్త్రం చెప్తోంది. ఈ రవి సంక్రమణాలు జరిపేటటువంటి కాలమును పుణ్యకాలముగా శాస్త్రములు చెప్తున్నాయని.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

లేటెస్ట్ ఫోటోలు

30 ఏళ్ల తరువాత అదృష్ట రాజయోగం.. ఈ 3 రాశులకు శుభ ఘడియలు

May 20, 2024, 11:30 AM

Gajalakshmi Yogam : గజలక్ష్మీ యోగం.. వీరికి అప్పులు తీరుతాయి.. వ్యాపారంలో లాభాలు!

May 20, 2024, 07:58 AM

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

ఇలా సూర్య భగవానుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించిన పుణ్యసమయమే మకర సంక్రాంతి. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సంవత్సరంలో 12 మాసములు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించును. ఇలా సూర్యుడు 12 రాశులలో సంచరించిన కాలమునే ఒక సంవత్సరం. ఈ సంవత్సర కాలమును 2 ఆయనములుగా విభజిస్తారు. ఒకటి ఉత్తరాయణము. రెండు దక్షిణాయణము.

ఉత్తరాయణంలో చేయాల్సినవి..

సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి ధనూరాశికి సంచరించే కాలమును దక్షిణాయనముగా అలాగే మకరరాశి నుంచి మిథున రాశి మధ్య సంచరించే కాలమును ఉత్తరాయణముగా జ్యోతిష్యశాస్త్రము చెప్తుంది. వేదాల ప్రకారం దేవతలకు ఉత్తరాయణము ఒక పగలు. దక్షిణాయనము ఒక రాత్రి. ఉ త్తరాయణ సమయములో దేవతలు మేల్కొని ఉండే కాలము. ఉత్తరాయణము శారీరక శ్రమకు, పూజలకు సాధనకు అనుకూలమైన కాలమని.. అలాగే దక్షిణాయనము ధ్యానానికి, దీక్షలకు, పితృదేవతార్చనకు, అనుకూలమైన కాలమని శాస్త్రములు తెలిపాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్నది కాబట్టే మహాభారతమునందు భీష్మాచార్యులవారు ఉత్తరాయణము వరకు అంపశయముపై ఎదురుచూసి ఉత్తరాయణము నందే తనువును చాలించారు.

పితృ దేవతలకు తర్పణాలు

సంక్రాంతిలో సం అంటే మిక్కిలి.. క్రాంతి అంటే అభ్యుదయము. మంచి అభ్యుదయమును ఇచ్చు క్రాంతి కనుకనే దీనిని సంక్రాంతి అని చెప్పినట్లుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడం చేత దీనిని మకర సంక్రాంతిగా చెప్తారు. మకర సంక్రాంతి రోజు ఏ వ్యక్తి అయినా తలస్నానాన్ని ఖచ్చితముగా ఆచరించాలి. గతించినటువంటి పితృ దేవతలకు తర్పణాలు వదలాలి. నూతన వస్త్రములు ధరించాలి.

దానధర్మములు..

సూర్యారాధన, విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. మకర సంక్రాంతి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా విశేషం. సంక్రాంతి రోజు దాన ధర్మములు చేయడం వలన కలిగేటటువంటి ఫలము కొన్ని కోట్ల రెట్లు ఉంటుంది. మకర సంక్రమణ పుణ్య సమయంలో చేసేటటువంటి దానధర్మములు సత్ఫలితములు ఇస్తాయని శాస్త్రములు తెలిపాయి. సంక్రాంతి రోజున నవధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వస్త్రములు వంటివి దానము చేసినటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలము లభిస్తుందని పండితులు తెలిపారు. కేవలం మకర సంక్రాంతి రోజు పితృ దేవతలకు నువ్వులతో తర్పణాలు వదలటం వలన మిగిలిన అన్ని సంక్రమణ సమయాల్లో తర్పణాలు వదిలిన ఫలితము లభించును. మకర సంక్రాంతి రోజు సూర్యనారాయణుని పూజ సత్యనారాయణ స్వామి వ్రతం వంటివి ఆచరించుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

టాపిక్

తదుపరి వ్యాసం