2023 Karkataka Rasi Phalalu : 2023 సంవత్సరం కర్కాటక రాశి వారికి ఇబ్బందులు తప్పవు-2023 karkataka rasi phalalu find horoscope prediction for cancer in telugu for year 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  2023 Karkataka Rasi Phalalu : 2023 సంవత్సరం కర్కాటక రాశి వారికి ఇబ్బందులు తప్పవు

2023 Karkataka Rasi Phalalu : 2023 సంవత్సరం కర్కాటక రాశి వారికి ఇబ్బందులు తప్పవు

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 30, 2022 04:43 PM IST

2023 Cancer Horoscope : ఆంగ్ల నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు బాగున్నాయని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 2023 కర్కాటక రాశి ఫలాలు ఇక్కడ చూడండి.

కర్కాటక రాశి రాశి ఫలాలు 2023
కర్కాటక రాశి రాశి ఫలాలు 2023

2023 Karkataka Rasi Phalalu : చిలకమర్తి పంచాంగ రీత్యా ధృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కర్కాటక రాశి వారికి 2023లో సమస్యలు అధికముగా ఉన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగ రూపకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. కర్కాటక రాశి వారికి 2023లో మధ్యస్త ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 2023 వరకు శని 7వ ఇంట మకర రాశిలో సంచరించడం.. గురుడు 9వ ఇంట సంచరించడం వల్ల మే 2023 నుంచి కర్కాటక రాశి వారికి శని అష్టమ స్థానమునందు గురు రాహువులు దశమ స్థానమునందు సంచరిస్తున్నారు. కర్కాటక రాశి వారికి 2023 కొంత సమస్యలతో కూడినటువంటి సంవత్సరం.

కర్కాటక రాశివారు 2023లో ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలయందు జాగ్రత్తలు వహించాలి. అష్టమ శని ప్రభావంచేత కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు కోర్టు వ్యవహారాలు చికాకులు వంటివి ఇబ్బంది పెడతాయి.

కర్కాటక రాశి ఉద్యోగస్తులకు 2023 మధ్యస్త ఫలితాలున్నాయి. ఉద్యోగములో రాజకీయాలు, ఒత్తిళ్లు, సమస్యలు, చికాకులు అధికముగా ఉంటాయి. 2023 కర్కాటక రాశి వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. వ్యాపారములో చికాకులు, ఆర్ధిక సమస్యలు ఏర్పడుతాయి. కర్కాటక రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు అధికముగా ఉండును. కర్కాటక రాశి రైతులకు 2023లో అనుకూలముగా లేదు. కర్కాటక రాశి సినీరంగం వారికి ఈ సంవత్సరం చెడు ఫలితములు అధికముగా ఉన్నాయి. విద్యార్థులు కష్టపడి చదవాల్సిన సంవత్సరం ఇది. మొత్తం మీద 2023 కర్కాటక రాశి వారికి మధ్యస్త ఫలితాలు అనుకూలముగా ఉన్నాయి. అష్టమ శని ప్రభావము చేత కర్కాటక రాశి వారు 2023లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తగా ఉ ౦డాలని కర్కాటక రాశివారికి సూచిస్తున్నాను.

కర్కాటక రాశి మరింత శుభఫలితాలు పొందాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించడం.. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుని, దుర్గాదేవిని పూజించడం మంచిది. కర్కాటక రాశివారు ధరించవలసినటువంటి నవరత్నం ముత్యము. కర్కాటక రాశివారు 2 ముఖములు గల రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితములు కలుగుతాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగ రూపకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

సంబంధిత కథనం