తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bhogi Pallu Function : పిల్లలకు మొదటిసారి భోగిపళ్లు పోస్తున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోండి..

Bhogi Pallu Function : పిల్లలకు మొదటిసారి భోగిపళ్లు పోస్తున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోండి..

13 January 2023, 15:58 IST

google News
    • Bhogi Pallu Function 2023 : భోగి రోజు చాలా మంది పిల్లలకు భోగిపళ్లు పోస్తారు. భోగిరోజు పాటించే సంప్రదాయాల్లో ఇది కూడా ఒకటి. అయితే నర దిష్టి పోగొట్టాలనే ఉద్దేశంతో దీనిని పాటిస్తున్నారు. అయితే భోగిపళ్లు పోసేప్పుడు ఏమి చేయాలి? ఎలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
భోగిపళ్లు ఫంక్షన్
భోగిపళ్లు ఫంక్షన్

భోగిపళ్లు ఫంక్షన్

Bhogi Pallu Function 2023 : సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. దాని ముందు రోజు వచ్చే భోగి కూడా అంతే ప్రాధన్యతనిస్తారు. ఆ రోజు పిల్లలకు పేరింటం చేసి.. భోగిపళ్లు కూడా పోస్తారు. సాయంత్రం చుట్టూ ఉన్న పెద్దవారిని పిలిచి.. పిల్లలకు రేగుపళ్లతో దిష్టి తీయిస్తారు. నర దిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు. అయితే ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం. అందుకే వారికి అప్పటివరకూ ఉన్న దిష్టి మొత్తాన్ని తీసేయడానికి భోగిపళ్లను పోస్తారు.

లేటెస్ట్ ఫోటోలు

Naval Dockyard Apprentice 2024 : విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ ఖాళీలు - ముఖ్య తేదీలివే

Nov 29, 2024, 09:54 PM

BMW M2: భారత్ లో బీఎండబ్ల్యూ ఎం2 లేటెస్ట్ ఎంట్రీ.. స్టైలింగ్ లో తిరుగులేని స్పోర్ట్ కూపే ఇది..

Nov 29, 2024, 09:50 PM

Hair fall problem: చలి కాలంలో జుట్టు ఊడే సమస్యకు కారణాలివే..

Nov 29, 2024, 09:31 PM

త్వరలో ఈ నాలుగు రాశుల వారికి మెండుగా అదృష్టం.. సంపద, ఆనందం!

Nov 29, 2024, 07:01 PM

AP Tourism : ఆంధ్ర ఊటీ అరకులోయ సిగలో.. మరో పర్యాటక సోయగం.. డోంట్ మిస్

Nov 29, 2024, 02:41 PM

TG Weather Updates : రేపట్నుంచి తెలంగాణలోనూ వర్షాలు - ఈ జిల్లాలకు IMD హెచ్చరికలు, తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

Nov 29, 2024, 02:28 PM

భోగిరోజు సాయంత్రం పిల్లలతో గొబ్బెమ్మలు పెట్టించి.. అనంతరం ఈ భోగి పళ్లు చేసే కార్యక్రమం మొదలుపెడతారు. నిజం చెప్పాలంటే ఈ భోగిపళ్లు పోసే విషయంలో వయసుతో ఎలాంటి పనిలేదు. ఎవరికైనా పోయొచ్చు. అయితే 12 ఏళ్లలోపు పిల్లలకే ఎక్కువగా భోగిపళ్లు పోస్తారు. రేగు పళ్లు, బంతిపూలు, చిల్లర నాణేలు, చెరుకు గడల ముక్కలు కలిపి.. పిల్లల తలపై నుంచి పడేట్టు పోస్తారు. మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి.. వారి తల మీదుగా కిందకి పడేలా పోస్తారు. అయితే అలా పోసిన పళ్లను తినకూడదు. దానిని ఎవరూ లేని చోట పారేయాలి. లేదంటే ఎవరికైనా దానం చేయాలి అంటారు.

అసలు పిల్లలకు రేగి పళ్లనే ఎందుకు పోస్తారు? అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. రేగిపండును అర్కఫలం అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లుతాడు. అందుకే పిల్లకు భోగిపళ్లు పోస్తారని చెప్తారు. అంతే కాదు దీని గురించి మన పురాణాలలో కూడా ప్రస్తావన ఉంది.

అంతేకాకుండా.. రేగుపళ్లతో పాటు బంతి పూల రెక్కలను కూడా దిష్టితీసేందుకు ఉపయోగిస్తారు. దీనివల్ల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి అంటారు. ఎందుకంటే బంతిపూలకు క్రిములను చంపే ప్రాథమిక లక్షణం ఉంది. పైగా ఇది చర్మానికి తగిలితే.. చాలా మంచిది అంటారు. చర్మ సంబంధమైన వ్యాధులనుంచి ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది అంటారు. అందుకే ఈ సంప్రదాయాన్ని కచ్చితంగా అమలు చేస్తారు.

తదుపరి వ్యాసం