తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Surya, Chandra Grahan: 2024లో సూర్య, చంద్రగ్రహణాలు ఎప్పుడు ఏర్పడుతున్నాయంటే..

Surya, chandra grahan: 2024లో సూర్య, చంద్రగ్రహణాలు ఎప్పుడు ఏర్పడుతున్నాయంటే..

Gunti Soundarya HT Telugu

19 December 2023, 12:17 IST

    • Surya, chandra grahan 2024: సూర్య, చంద్ర గ్రహణాలకి హిందూమతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కొత్త ఏడాది ఈ రెండు గ్రహణాలు ఎప్పుడు వచ్చాయో తెలుసా?
2024 లో సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు?
2024 లో సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు?

2024 లో సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు?

Surya, chandra grahan 2024: 2024 సంవత్సరంలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణించినప్పుడు సూర్యకాంతి భూమికి చేరదు. ఫలితంగా సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అదే సమయంలో చంద్రుడుకి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడుతుంది. దాని వల్ల భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించదు. దీన్ని చంద్ర గ్రహణం అంటారు.

లేటెస్ట్ ఫోటోలు

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

Mercury transit: వీరి మీద కనక వర్షం కురిపించబోతున్న బుధుడు.. అందులో మీరు ఉన్నారా?

May 16, 2024, 01:34 PM

Jupiter combust: అస్తంగత్వ దశలోకి గురు గ్రహం.. వీరికి అప్పులు, సమస్యలు, కష్టాలే

May 16, 2024, 01:11 PM

వృషభ రాశిలో సూర్యుడు: నెలపాటు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. ఈ ఇబ్బందులు కలగొచ్చు

May 16, 2024, 12:10 PM

Guru Aditya yoga: 12 ఏళ్ల తర్వాత గురు ఆదిత్య యోగం.. వీరికి గౌరవం, డబ్బు, అన్నింటా విజయం

May 16, 2024, 08:25 AM

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

గ్రహణాలకి హిందువులు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. గ్రహణం సమయంలో శుభ కార్యాలు చేయరు. గర్భిణులు కూడా గ్రహణ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. 2024 సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఎప్పుడు వస్తాయి. వాటి ప్రభావం భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం.

తొలి సూర్య గ్రహణం

2024 సంవత్సరంలో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడుతుంది. ఆ రోజు రాత్రి 9.12 గంటలకి ప్రారంభమై అర్థరాత్రి 1.25 గంటలకు ముగుస్తుంది. గ్రహణానికి 12 గంటల ముందు సుతక్ కాలం ప్రారభమవుతుంది. భారత్ లో సూర్య గ్రహణం కనిపించదు. అందుకే సుతక్ కాలం కూడా చెల్లదు. పశ్చిమాసియా, నైరుతి ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహా సముద్రం, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువాల్లో తొలి సూర్యగ్రహణం కనిపిస్తుంది.

రెండో సూర్య గ్రహణం ఎప్పుడంటే?

2024లో రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2న ఏర్పడనుంది. ఆరోజు రాత్రి 9.13 గంటలకి సూర్య గ్రహణం ఏర్పడి అర్థరాత్రి 3.17 గంటల వరకు ఉంటుంది. ఇదే కొత్త ఏడాదిలో ఏర్పడే చివరి సూర్యగ్రహణం. ఇది కూడా భారత్ లో కనిపించదు. అందువల్ల సుతక్ కాలం చెల్లదు. రెండో సూర్య గ్రహణం అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహా సముద్రం ప్రాంతంలో కనిపిస్తుంది. 2024 లో భారత్ లో రెండు సూర్యగ్రహణాలు కనిపించవు.

తొలి చంద్రగ్రహణం ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో పెనుంబ్రా చంద్రగ్రహణం మార్చి 25 తేదీన వస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఆఫ్రికా, ఫసిఫిక్ మహాసముద్రంలో చంద్రగ్రహణం కనిపిస్తుంది. భారత్ లో కనిపించకపోవడం వల్ల సుతక్ కాలం ఉండదు.

రెండో చంద్ర గ్రహణం ఎప్పుడు

18 సెప్టెంబర్ 2024లో చివరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది కూడా భారత్ లో కనిపించదు. యూరప్, ఉత్తర, దక్షిణ అమెరికా ఆఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కనిపిస్తుంది. భారత్ లో ఉండకపోవడం వల్ల సుతక్ కాలం పాటించాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది వచ్చే రెండు సూర్య గ్రహణాలు, చంద్ర గ్రహణాల ప్రభావం భారత్ మీద ఏ మాత్రం ఉండవు.

తదుపరి వ్యాసం