తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Transit Of Mercury: శని సొంతరాశిలోకి చేరిన బుధుడు.. ఈ రాశుల జాతకులకి స్వర్ణయుగమే

Transit of mercury: శని సొంతరాశిలోకి చేరిన బుధుడు.. ఈ రాశుల జాతకులకి స్వర్ణయుగమే

Gunti Soundarya HT Telugu

01 February 2024, 17:00 IST

    • Transit of mercury: శని సొంత రాశి అయిన మకర రాశిలోకి బుధుడు ప్రవేశం చేశాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది. మరి కొందరికి ఆరోగ్య రీత్యా సమస్యలు వస్తాయి. 
మకర రాశిలోకి బుధుడు
మకర రాశిలోకి బుధుడు (pixabay )

మకర రాశిలోకి బుధుడు

Transit of mercury: సంతోషం, దాంపత్య జీవితం, తెలివితేటలు, వ్యాపారం వంటి వాటికి కారకుడిగా గ్రహాల రాకుమారుడు బుధుడుని భావిస్తారు. బుధ స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఫిబ్రవరి 1, 2024 కృష్ణ పక్ష షష్టి రోజున గురువారం ఉదయం బుధుడు ధనుస్సు రాశి నుంచి శని సొంత రాశి అయిన మకర రాశిలోకి ప్రవేశించాడు. బుధుడు రాశి మార్పు పన్నెండు రాశుల మీద పడనుంది. మేష రాశి నుంచి మీన రాశి వరకు బుధుడు ఎవరికి మేలు చేస్తాడో ఎవరికి సమస్యలు కలిగిస్తాడో చూద్దాం.

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

మేష రాశి

బుధుడు మేష రాశి పదో ఇంట్లో సంచరిస్తాడు. శక్తిమంతుడు, రోగగ్రస్తుడుగా ఉండటం వల్ల అధికారానికి సంబంధించిన పనుల్లో పురోగతి ఉంటుంది. సోదరులు, సోదరీమణులు, స్నేహితుల మద్దతు లభిస్తుంది. పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. చిన్న పని అయినా కూడా ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రత్యర్థి నుంచి ఒత్తిడి ఉంటుంది.

వృషభ రాశి

బుధుడు తొమ్మిదో స్థానంలో ఉన్న ఇంట్లో సంచరించడం వల్ల అన్ని పనుల్లో అదృష్టం మీ వెంట ఉంటుంది. తండ్రి సహకారం లభిస్తుంది. మేధోపరమైన పనుల్లో పురోగతి ఉంటుంది. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. ధన సంబంధమైన పనుల్లో పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధి ఉంటుంది.

మిథున రాశి

ఆరోగ్యం, సంతోషాలకు కారకుడైన బుధుడు మిథున రాశి ఎనిమిదో ఇంట్లో సంచరించడం వల్ల మనోధైర్యం తగ్గుతుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

కర్కాటక రాశి

ఖర్చులు, శక్తి కారణంగా భావించే బుధుడు కర్కాటక రాశి ఏడో ఇంట్లో సంచరించడం వల్ల రోజువారీ ఉపాధి పెరుగుతుంది. బలం, సామాజిక వృత్తం పెరుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో విభేదాలు తలెత్తుతాయి. మానసిక ఆలోచనలు పెరుగుతాయి. భాగస్వామ్య పనుల్లో అప్రమత్తంగా ఉండాలి.

సింహం

లాభనష్టాలకి కారకుడైనందున సింహ రాశి ఆరో ఇంట్లో సంచరిస్తున్నాడు. కుటుంబ పనులకి సంబంధించి ఒత్తిడి తలెత్తే అవకాశం ఉంది. డబ్బుకి సంబంధించిన పనుల్లో మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులకి కాస్త ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి.

కన్యా రాశి

ఈ రాశి ఐదో ఇంట్లో బుధుడు సంచరించడం వల్ల ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మేధో సామర్థ్యం పెరుగుతుంది. బోధన, అభ్యాసనలో పురోగతి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆదాయ వనరులు పెరుగుతాయి.

తులా రాశి

బుధుడు నాలుగో ఇంట్లో సంచరిస్తాడు. అదృష్టం మీకు అన్ని వేళలా సహకరిస్తుంది. గృహంలో సంతోషం ఉంటుంది. వాహన సౌఖ్యం పెరుగుతుంది. ఆకస్మిక ఖర్చులు కూడా పెరుగుతాయి. ఛాతీలో కాస్త అసౌకర్యంగా ఉంటుంది.

వృశ్చిక రాశి

ఎనిమిదో ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. తోబుట్టువులు, మిత్రులతో విభేదించే పరిస్థితి ఏర్పడుతుంది. పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారానికి సమయం అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి రెండో ఇంట్లో బుధుడు సంచరిస్తున్నాడు. ఫలితంగా వ్యాపారంలో పురోగతి ఉద్యోగంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం. జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనం పొందే పరిస్థితి ఉంటుంది. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ఆదాయం పెరుగుతుంది.

మకర రాశి

ఆరో ఇంట్లో బుధ సంచారం ఫలితంగా ఆరోగ్యానికి సంబంధించి ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక ఆలోచనలు పెరుగుతాయి. తండ్రి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. రోజువారీ ఆదాయం బాగుంటుంది.

కుంభ రాశి

కుంభ రాశి ఐదు, ఎనిమిదో ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. ఫలితంగా పిల్లల వైపు నుంచి ఆందోళన కలిగే వాతావరణం ఏర్పడుతుంది. అకస్మాత్తుగా ఖర్చులు పెరుగుతాయి. సన్నిహితంగా ఉండే వ్యక్తి నుంచి ఒత్తిడి ఉంటుంది. చర్మ అలర్జీలిలు చికాకు పెడతాయి.

మీన రాశి

గృహ, వాహన సౌఖ్యం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో సానుకూల మార్పులు ఉంటాయి. రోజువారీ ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామి వైపు నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.

తదుపరి వ్యాసం