తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Meena Rasi 2024: మీనరాశి జాతకులకు కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

Meena Rasi 2024: మీనరాశి జాతకులకు కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

HT Telugu Desk HT Telugu

22 December 2023, 9:47 IST

    • Meena Rasi 2024: మీనరాశి 2024 రాశి ఫలాలు ప్రతికూలంగా ఉన్నాయని, ఈజాతకులు జాగ్రత్తగా వ్యవహరించవలసిన సంవత్సరమని చెప్పిన పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. నూతన సంవత్సర రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Meena Rasi 2024: మీనరాశి 2024 రాశి ఫలాలు
Meena Rasi 2024: మీనరాశి 2024 రాశి ఫలాలు

Meena Rasi 2024: మీనరాశి 2024 రాశి ఫలాలు

2024 సంవత్సరంలో మీనరాశి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ సంవత్సరం వారు ఆచరించేటటువంటి ప్రతి పనిలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

2024 సంవత్సరం మీనరాశి వారికి జనవరి నుండి ఏప్రిల్‌ గురుబలము కారణము చేత కలసివచ్చును. అయినప్పటికి మీనరాశి వారికి జన్మరాశిలో కేతువు కళత్రములో రాహువు ప్రభావం చేత ప్రతి పనియందు చికాకులు వాదనలు సమస్యలు ఇబ్బందిపెట్టును. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని 'ప్రభావం చేత అందులోనూ శని వ్యయస్థానములో ఉండటంచేత ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి.

జనవరి నుండి ఏప్రిల్‌ వరకు తృతీయంలో గురుని అనుకూలత వలన మీన రాశి వారికి 2024 సంవత్సరంలో కొంత అనుకూల ఫలితాలు కలిగే అవకాశముంది. మే నుండి డిసెంబర్‌ వరకు తృతీయంలో గురుడి ప్రతికూల ప్రభావం చేత మీన రాశి వారికి ఆర్ధిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టునని ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి తెలియచేశారు.

మీనరాశి ఉద్యోగస్తులకు ఆశించినంత అనుకూలంగా ఉండదు. మీనరాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో అప్పుల సమస్యలు వేధించును. మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. మీనరాశి స్త్రీలకు కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టు సూచనలు కనబడుచున్నవి. మీనరాశి వారికి మొత్తంమీద 2024 సంవత్సరం ప్రధమార్థం మధ్యస్థ ఫలితాలు, ద్వితీయార్థం ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయని చిలకమర్తి తెలిపారు.

మీన రాశి 2024ప్రేమ జీవితం

2024 సంవత్సరంలో మీనరాశి వారికి ప్రేమ జీవితం వంటి విషయాలలో ప్రతికూల ఫలితాలు అధికముగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయములు కలుగు సూచనలు అధికముగా ఉన్నాయి. జన్మ కేతువు ప్రభావం చేత ఈ సంవత్సరం ప్రేమించిన వారి నుంచే మానసిక ఒత్తిళ్ళు కలుగును. మీనరాశి వారికి 2024 సంవత్సరం ప్రేమలకు సంబంధించిన విషయాలలో తర్కవితర్కాలకు, వాదనలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. ప్రతీ విషయాన్ని మనస్సులోకి తీసుకోవడం, ప్రతీ విషయానికి అతిగా ఆలోచించడం, స్పందించడం వంటి విషయాలకు దూరంగా ఉండాలని సూచన.

2024 మీన రాశి ఆర్థిక విషయాలు

2024 సంవత్సరం మీనరాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు అధికముగా ఉండును. మీనరాశి వారు అప్పు చేయవద్దు. అప్పు ఇవ్వవద్దు అని సూచిస్తున్నాను. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరం రావలసిన ధనం సమయానికి చేతికి అందకపోవడం. అప్పులు చేయాల్సినటువంటి స్థితి కొంత ఇబ్బందిపెట్టును. వ్యాపారస్తులకు ఆర్ధికపరంగా ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. షేర్‌ మార్కెట్‌ వంటి రంగాలలో నష్టాలు కలుగును. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన.

2024 మీనరాశి కెరీర్

2024 సంవత్సరం మీనరాశి వారికి కెరీర్ పరంగా 2024 సంవత్సరం మధ్యస్థంగా ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించినప్పటికి ఆర్థికపరంగా ఆశించిన స్థాయి ఫలితములు ఉండవు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు బాగా పెరుగును. జన్మకేతువు ప్రభావం వలన ఆవేశపూరిత నిర్ణయాల వలన నష్టపోయేటటువంటి స్థితి ఏర్పడును. మీనరాశివారికి 2024 సంవత్సరంలో ప్రథమార్ధం కెరీర్ పరంగా అనుకూలంగాను ద్వితీయార్థం మధ్యస్థంగాను గోచరిస్తుందని చిలకమర్తి తెలిపారు.

2024 మీనరాశి ఆరోగ్యం

2024 సంవత్సరం మీనరాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు. మానసిక సమస్యలు, ఒత్తిళ్ళు మీనరాశిని ఇబ్బందిపెట్టును. అతిగా ఆలోచించడం, ఆవేశపడడం వంటి విషయాలకు మీనరాశి వారు ఈ సంవత్సరం దూరంగా ఉండాలని సూచన. ఏలినాటి శని ప్రభావం జన్మకేతువు ప్రభావంచేత ఆరోగ్య సంబంధిత విషయాల్లో మీనరాశివారు జాగ్రత్తవహించడం మంచిది. మీనరాశి వారు మే నుండి డిసెంబర్‌ మధ్య సమయం అరోగ్య విషయాల్లో ఖచ్చితమైన శ్రద్ధ వహించాలని సూచిస్తున్నాను.

2024 మీనరాశి పరిహారాలు

మీనరాశి జాతకులు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఏలినాటి శని దోషనివారణ కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. ప్రతి శనివారం దశరథ ప్రోక్త శని స్తోత్రం, నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి. గురువారం రోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
తదుపరి వ్యాసం