తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Daridra Yogam: దరిద్ర యోగం ప్రభావంతో వీరికి ఆర్థిక సమస్యలతో జేబులు ఖాళీ, విజయం సాధించడం కష్టమే

Daridra yogam: దరిద్ర యోగం ప్రభావంతో వీరికి ఆర్థిక సమస్యలతో జేబులు ఖాళీ, విజయం సాధించడం కష్టమే

Gunti Soundarya HT Telugu

18 April 2024, 15:14 IST

    • Daridra yogam: గ్రహాల రాకుమారుడు బుధుడు జ్యోతిష్య శాస్త్రంలోనే అశుభకరమైన దరిద్ర యోగాన్ని ఇస్తున్నాడు. దీని ఫలితంగా ఆర్థిక సమస్యల వల్ల జేబులు ఖాళీ కాబోతున్నాయి. విజయం సాధించడం కూడా కష్టమే అవుతుంది. 
దరిద్ర యోగం ప్రభావంతో ఆర్థిక సమస్యలు
దరిద్ర యోగం ప్రభావంతో ఆర్థిక సమస్యలు (pixabay)

దరిద్ర యోగం ప్రభావంతో ఆర్థిక సమస్యలు

Daridra yogam: గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు అక్కడ ఉన్న గ్రహాలతో సంయోగం చెందుతాయి. దీని ప్రభావం వల్ల రాజయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి.

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ప్రస్తుతం గ్రహాల రాకుమారుడు మీన రాశిలో తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. ఫలితంగా దరిద్రయోగం ఏర్పడింది. ఇది ఆర్థిక ఇబ్బందులను తీసుకొస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ చార్ట్ లో చంద్రుడు, శని గ్రహాల స్థానాలు చూడటం ద్వారా దరిద్ర యోగం ఉందో లేదో చూసుకోవచ్చు. జన్మ కుండలిలో దరిద్ర యోగం ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది అశుభంగా పరిగణిస్తారు. ఈ దరిద్ర యోగ ప్రభావం నుంచి బయట పడేందుకు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది.

దరిద్ర యోగం ప్రభావాలు

జాతకంలో దరిద్ర యోగం ఉన్న వ్యక్తులు వృత్తిపరమైన అభివృద్ధిలో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని ఫలితంగా స్తబ్దమైన ఆదాయం, ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుంది. కెరీర్ లో సవాళ్ళు ఎదురవుతాయి.

రుణాలు, అప్పులు పేరుకుపోతాయి. వాటిని తీర్చడం చాలా కష్టంగా మారుతుంది. దరిద్ర యోగం కొనసాగుతున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. చేతిలో డబ్బు నిలవడం కష్టం అవుతుంది. డబ్బు ఆదా చేసే అవకాశం ఉండకపోవచ్చు. స్థిరమైన ఆర్థిక పరిస్థితిని పొందడం కష్టమవుతుంది.

దరిద్ర యోగం ప్రభావంతో ఊహించని ఖర్చులు మిమ్మల్ని ఉక్కరి బిక్కిరి చేస్తాయి. ఆర్థిక సంక్షోభాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఆదాయం రావడం కూడా కష్టంగా మారుతుంది. ఇది దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడంలో ఇబ్బందులను తీసుకొస్తుంది. ఈ సమయంలో అప్పులు చేసినా వాటిని తీర్చేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

దరిద్ర యోగం తొలగించే పరిహారాలు

చంద్రుడు, శని ప్రభావాలు తగ్గించడం కోసం కొన్ని మంత్రాలను రోజు పఠించాలి. శని, చంద్రుల ప్రతికూలంగా ఏర్పడే ప్రభావాలను తగ్గించుకోవడం కోసం సోమవారాల్లో ఉపవాసం ఉండటం మంచిది. ఇలా చేయడం వల్ల గ్రహాల స్థితి మీకు అనుకూలంగా మారుతుంది.

నీల రంగు ఉంగరం ధరించడం వల్ల రెండు గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. పండితులను సంప్రదించిన తర్వాత ఈ రంగు రాయి ధరించడం ఉత్తమం. అప్పుడే సత్ఫలితాలు ఇస్తుంది. అలాగే సోమ, శని వారాల్లో దానాలు చేయటం వల్ల మీ జీవితంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. కుబేరుడు, లక్ష్మి దేవిని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సు లభిస్తుంది. దేవతల ఆశీర్వాదాలు పొందుతారు.

మీ జాతకంలోని దుష్ట గ్రహాలను శాంతింప చేసేందుకు శని శాంతి పూజ లేదా నవగ్రహ పూజ వంటివి నిర్వహించాలి. అలాగే జ్యోతిష్యులను సంప్రదించి అనేక రకాల పరిష్కార మార్గాలను అనుసరించాలి.

దరిద్ర యోగం ఎదుర్కోబోయే రాశులు ఇవే

దరిద్ర యోగం ప్రభావంతో మిథున, కన్య, ధనుస్సు రాశి వారికి సమస్యలు వస్తాయి. ఈ యోగం చాలా దురదృష్టాన్ని ఇవ్వబోతుంది. కెరీర్ లో సమస్యలు ఎదుర్కొంటారు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం క్షీణిస్తుంది. సంపద రాకకు అడ్డంకులు ఏర్పడతాయి.

ఉద్యోగస్తులు పని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఉన్నతాధికారుల దగ్గర మీకు చెడ్డ పేరు రావచ్చు. సహోద్యోగుల నుంచి సహకారం అందకపోవచ్చు. వైవాహిక జీవితంలో భాగస్వాములు ఒకరితో ఒకరు గొడవ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే శారీరకంగా గాయపడే అవకాశాలు ఉన్నాయి. ఈ యోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమయంలో కొత్త పనులు ఏవి ప్రారంభించకుండా ఉండటమే మంచిది.

మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. ఈ సమయంలో ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు. లేదంటే నష్టాన్ని భరించాల్సి వస్తుంది. పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మంచిది.

 

 

 

తదుపరి వ్యాసం