తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gajalakshmi Raja Yogam: గజలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల జాతకుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

Gajalakshmi raja yogam: గజలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల జాతకుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

Gunti Soundarya HT Telugu

31 January 2024, 18:00 IST

    • Gajalakshmi raja yogam: బృహస్పతి, శుక్రుడు కలయిక వల్ల ఏర్పడే గజలక్ష్మీ రాజయోగం కొన్ని రాశుల వారికి వరంగా మారబోతుంది. అందులో మరి మీ రాశి ఉందో లేదో చూసుకోండి. 
గజలక్ష్మీ రాజయోగం ప్రభావం
గజలక్ష్మీ రాజయోగం ప్రభావం

గజలక్ష్మీ రాజయోగం ప్రభావం

Gajalakshmi raja yogam: దేవతల గురు బృహస్పతి, శుభదాయకంగా పరిగణించే శుక్రుడు ఒకే రాశిలో కలవనున్నారు. గురువు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి సంపద రెట్టింపు అవుతుంది. ఈ రెండు శుభ గ్రహాల సంయోగం ఫలితంగా గజలక్ష్మీ రాజ యోగం ఏర్పడబోతుంది. ఫిబ్రవరి నెలలో ఏర్పడే ఈ రాజయోగం కొన్ని రాశులకి ప్రత్యేక వరంగా మారబోతుంది.

లేటెస్ట్ ఫోటోలు

Gajalakshmi Yogam : గజలక్ష్మీ యోగం.. వీరికి అప్పులు తీరుతాయి.. వ్యాపారంలో లాభాలు!

May 20, 2024, 07:58 AM

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

జ్యోతిష్య శాస్త్రంలో గజలక్ష్మీ రాజయోగం చాలా పవిత్రమైనది, శుభప్రదంగా భావిస్తారు. గజ అంటే ఏనుగు అని అర్థం. అంటే లక్ష్మీదేవి ఈ రాశుల మీద అంత మొత్తంలో ధనవర్షం కురిపించబోతుంది. శుక్రుడు విలాసం, అదృష్టాన్ని ఇస్తే గురు గ్రహం సంపదని, శ్రేయస్సుని అందిస్తుంది. ఈ రెండు గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత శుక్రుడు, బృహస్పతి గ్రహాలు మేష రాశిలో కలుసుకోబోతున్నాయి.

గురు గ్రహం సొంత రాశి అయిన మేష రాశిలో బృహస్పతి ఉండగా శుక్రుడు కూడా ఏప్రిల్ 24న ఈ రాశిలో సంచరించబోతున్నాడు. దీంతో ఈ రెండు రాశుల కలయిక వాలల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. ఈ రాజయోగం వల్ల మూడు రాశుల వారికి సమాజంలో గౌరవం పెరగనుంది. ఆ రాశుల జాబితాలో మీ రాశి ఉందేమో చూసుకోండి.

మేష రాశి

మేష రాశిలోనే బృహస్పతి, శుక్రుడు కలయిక జరగబోవడం వల్ల ఈ రాశి వారికి చాలా ఫలవంతమైన ప్రయోజనాలు అందుతాయి. ఈ యోగం శుభ ప్రభావంతో మంచి రోజులు ప్రారంభమవుతాయి. జీవితంలో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారం చేసే వారికి ఊహించని విధంగా లాభాలు గడిస్తారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. మీ పని తనం మరింత మెరుగుపడుతుంది. ఉద్యోగస్థులకి ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం కూడా పొందుతారు.

మిథున రాశి

బృహస్పతి, శుక్రుల సంయోగం మిథున రాశి వారికి శుభప్రదంగా కాబోతుంది. ఈ రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. కెరీర్ లో ఊహించని విధంగా విజయాలు మీ సొంతం అవుతాయి. ఆటంకాల వల్ల ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. పని మీద శ్రద్ధ పెరుగుతుంది. మీ కృషి, ఉత్సాహం చూసి ఉన్నతాధికారులు మరిన్ని బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి

గజలక్ష్మీ రాజయోగం కర్కాటక రాశి వారి అదృష్టాన్ని పెంచుతుంది. ప్రతి రంగంలోనూ విజయం వీరిదే. వ్యాపార రంగంలో పని చేస్తున్న వారికి ఇది ఒక వరం లాంటి సమయం. కొత్త పనులు ప్రారంభించాలని అనుకుంటే ఈ సమయం ఉత్తమంగా ఉంటుంది. రాజయోగం వల్ల అనుకూల లితాలు పొందుతారు. వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు మరింత ధృడంగా మారతాయి. జీవిత భాగస్వామితో రొమాంటిక్ టైమ్ గడుపుతారు. పని పట్ల మీరు చూపించే శ్రద్ధ వల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.

తదుపరి వ్యాసం