తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  చిత్రం చెప్పే కథ । ఏయే రాష్ట్రాల్లో హోలీ ఎలా జరుపుకుంటారు?

చిత్రం చెప్పే కథ । ఏయే రాష్ట్రాల్లో హోలీ ఎలా జరుపుకుంటారు?

17 March 2022, 17:27 IST

రంగుల పండుగ హోలీ.. శీతాకాలం ముగింపునకు, వసంతకాలం ఆగమనానికి ప్రతీక. సాధారణంగా ప్రతీ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 18న హోలీ జరుపుకుంటున్నారు. ఇది హిందువుల పండుగ.

  • రంగుల పండుగ హోలీ.. శీతాకాలం ముగింపునకు, వసంతకాలం ఆగమనానికి ప్రతీక. సాధారణంగా ప్రతీ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 18న హోలీ జరుపుకుంటున్నారు. ఇది హిందువుల పండుగ.
హోలీ అనేది ఒక భారతీయ పండుగ. ఇది ప్రధానంగా హిందువుల పండగే అయినప్పటికీ దీనిని దేశవ్యాప్తంగా వివిధ మతాలవారు వైభవంగా, ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. హోలీ రోజున ఒకరిపై మరొకరు రంగులు చల్లుకోవడం మనకు తెలిసిందే. అయితే వివిధ రాష్ట్రలోని ప్రజలు కొన్ని ప్రత్యేక పద్ధతులను పాటిస్తారు.
(1 / 10)
హోలీ అనేది ఒక భారతీయ పండుగ. ఇది ప్రధానంగా హిందువుల పండగే అయినప్పటికీ దీనిని దేశవ్యాప్తంగా వివిధ మతాలవారు వైభవంగా, ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. హోలీ రోజున ఒకరిపై మరొకరు రంగులు చల్లుకోవడం మనకు తెలిసిందే. అయితే వివిధ రాష్ట్రలోని ప్రజలు కొన్ని ప్రత్యేక పద్ధతులను పాటిస్తారు.(Unsplash)
ఉత్తరప్రదేశ్ - లఠ్మార్ హోలీ: అంటే లాఠీ దెబ్బలు కొట్టడం. ఉత్తర్ ప్రదేశ్ లోని బర్సానా, మథుర, బృందావన్‌లలో హోలీ వేడుకల్లో భాగంగా స్త్రీలు సరదాగా పురుషులను లాఠీలతో కొట్టారు. పురుషులు ఆ లాఠీ దెబ్బలు తమపై పడకుండా డాలు లేదా షీల్డ్‌తో తమను తాము రక్షించుకుంటారు.
(2 / 10)
ఉత్తరప్రదేశ్ - లఠ్మార్ హోలీ: అంటే లాఠీ దెబ్బలు కొట్టడం. ఉత్తర్ ప్రదేశ్ లోని బర్సానా, మథుర, బృందావన్‌లలో హోలీ వేడుకల్లో భాగంగా స్త్రీలు సరదాగా పురుషులను లాఠీలతో కొట్టారు. పురుషులు ఆ లాఠీ దెబ్బలు తమపై పడకుండా డాలు లేదా షీల్డ్‌తో తమను తాము రక్షించుకుంటారు.(Unsplash)
మహారాష్ట్రలో - మహారాష్ట్రలో రంగ పంచమి పేరుతో హోలీ వేడుకలు జరుగుతాయి. ఇక్కడి ప్రజలు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా కట్టెల చితిని పేర్చి దానిని అంటించి పండగను ప్రారంభిస్తారు. మరుసటి రోజే రంగులు చల్లుకుంటూ హోలీ ఆడతారు.
(3 / 10)
మహారాష్ట్రలో - మహారాష్ట్రలో రంగ పంచమి పేరుతో హోలీ వేడుకలు జరుగుతాయి. ఇక్కడి ప్రజలు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా కట్టెల చితిని పేర్చి దానిని అంటించి పండగను ప్రారంభిస్తారు. మరుసటి రోజే రంగులు చల్లుకుంటూ హోలీ ఆడతారు.(Unsplash)
గోవా - గోవాలో షిగ్మో పేరుతో ఒక భారీ కార్నివాల్ జరుగుతుంది. సినిమాల్లో చూపించినట్లుగా ఫోక్ మ్యూజిక్ వినిపిస్తుండగా ప్రజలు ఇళ్ల నుంచి వీధుల్లోకి వచ్చి తమకు నచ్చినట్లుగా డాన్స్ చేస్తారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పరుగులు తీస్తారు.
(4 / 10)
గోవా - గోవాలో షిగ్మో పేరుతో ఒక భారీ కార్నివాల్ జరుగుతుంది. సినిమాల్లో చూపించినట్లుగా ఫోక్ మ్యూజిక్ వినిపిస్తుండగా ప్రజలు ఇళ్ల నుంచి వీధుల్లోకి వచ్చి తమకు నచ్చినట్లుగా డాన్స్ చేస్తారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పరుగులు తీస్తారు.
తెలంగాణ: తెలంగాణలో రంగుల పున్నమి పేరుతో హోలీ వేడుకలు జరుగుతాయి. ఊర్లలో రింగిస్ బిళ్ల జాజిరి పాటలు చాలా ఫేమస్. చెడు దృష్టి పోవాలని, మంచి మార్గం చూపాలంటూ కాముడి దహనం నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకుంటారు.
(5 / 10)
తెలంగాణ: తెలంగాణలో రంగుల పున్నమి పేరుతో హోలీ వేడుకలు జరుగుతాయి. ఊర్లలో రింగిస్ బిళ్ల జాజిరి పాటలు చాలా ఫేమస్. చెడు దృష్టి పోవాలని, మంచి మార్గం చూపాలంటూ కాముడి దహనం నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకుంటారు.(HT Photo)
కేరళ - కేరళలో మంజల్ కులి పేరుతో వేడుకలు జరుగుతాయి. మిగతా రాష్ట్రాల హోలీ వేడుకలతో పోలిస్తే ఇక్కడ విభిన్నంగా ఉంటాయి. కుడుంబి, కొంకణి వర్గాల ప్రజలు ప్రధానంగా దేవాలయాల్లో భక్తి పాటలు, జానపదపాటలు పాడుకుంటూ పసుపునీళ్లు చల్లుకుంటారు.
(6 / 10)
కేరళ - కేరళలో మంజల్ కులి పేరుతో వేడుకలు జరుగుతాయి. మిగతా రాష్ట్రాల హోలీ వేడుకలతో పోలిస్తే ఇక్కడ విభిన్నంగా ఉంటాయి. కుడుంబి, కొంకణి వర్గాల ప్రజలు ప్రధానంగా దేవాలయాల్లో భక్తి పాటలు, జానపదపాటలు పాడుకుంటూ పసుపునీళ్లు చల్లుకుంటారు.(Unsplash)
రాజస్థాన్ - ఉదయపూర్ లో రాయల్ హోలీ పేరుతో వేడుకలు జరుగుతాయి. మేవార్ రాజ కుటుంబం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పండగ జరుగుతుంది. సంప్రదాయం ప్రకారం హోలిక దిష్టిబొమ్మను దహనం చేస్తారు. రాజ గుర్రాలను అలంకరించి బ్యాండ్‌ మేళాలతో ఊరేగింపు జరుగుతుంది.
(7 / 10)
రాజస్థాన్ - ఉదయపూర్ లో రాయల్ హోలీ పేరుతో వేడుకలు జరుగుతాయి. మేవార్ రాజ కుటుంబం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పండగ జరుగుతుంది. సంప్రదాయం ప్రకారం హోలిక దిష్టిబొమ్మను దహనం చేస్తారు. రాజ గుర్రాలను అలంకరించి బ్యాండ్‌ మేళాలతో ఊరేగింపు జరుగుతుంది.(Unsplash)
ఉత్తరాఖండ్ - కుమావోని హోలీ పేరుతో ఇక్కడి కుమావోన్ ప్రాంతంలోని ప్రజలు వేడుకలు జరిపుకుంటారు. వీరి హోలీ వేడుకల్లో రంగులు చల్లుకోవడం మితంగా ఉంటుంది. సంగీత కచేరీలకు ఎక్కువ ప్రాధ్యాన్యం ఉంటుంది.
(8 / 10)
ఉత్తరాఖండ్ - కుమావోని హోలీ పేరుతో ఇక్కడి కుమావోన్ ప్రాంతంలోని ప్రజలు వేడుకలు జరిపుకుంటారు. వీరి హోలీ వేడుకల్లో రంగులు చల్లుకోవడం మితంగా ఉంటుంది. సంగీత కచేరీలకు ఎక్కువ ప్రాధ్యాన్యం ఉంటుంది.(Unsplash)
పంజాబ్ - పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్‌లో హోల్లా మొహల్లా పేరుతో మూడు రోజుల పాటు సిక్కు ఉత్సవం జరుగుతుంది. ఈ రోజున, ఉత్తుత్తి యుద్ధాలు జరుగుతాయి, తరువాత సంగీత, కవితల పోటీలు నిర్వహిస్తారు.
(9 / 10)
పంజాబ్ - పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్‌లో హోల్లా మొహల్లా పేరుతో మూడు రోజుల పాటు సిక్కు ఉత్సవం జరుగుతుంది. ఈ రోజున, ఉత్తుత్తి యుద్ధాలు జరుగుతాయి, తరువాత సంగీత, కవితల పోటీలు నిర్వహిస్తారు.(Instagram/@the_diablo1996)

    ఆర్టికల్ షేర్ చేయండి