తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tamilnadu All-party Meet Rejects Quota To Ews: ‘‘Ews కోటాకు మేం వ్యతిరేకం’’

Tamilnadu All-party meet rejects quota to EWS: ‘‘EWS కోటాకు మేం వ్యతిరేకం’’

HT Telugu Desk HT Telugu

12 November 2022, 21:51 IST

  • Tamilnadu All-party meet rejects quota to EWS: అగ్ర వర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 103వ రాజ్యాంగ సవరణకు తాము వ్యతిరేకమని తమిళనాడులో అధికార డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం స్పష్టం చేసింది.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (HT_PRINT)

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

Tamilnadu All-party meet rejects quota to EWS: అగ్రవర్ణ పేదలకు(EWS) 10% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 103వ రాజ్యాంగ సవరణను ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్ధిస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో తమిళనాడులో అధికార డీఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన శనివారం అఖిలపక్ష భేటీ నిర్వహించింది.

Tamilnadu All-party meet rejects quota to EWS: మేం వ్యతిరేకం

అగ్రవర్ణాల్లోని పేదలకు(EWS) రిజర్వేషన్లు కల్పించడమనేది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని డీఎంకే పేర్కొంది. ఆ రాజ్యాంగ సవరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. EWS కోటాను వ్యతిరేకిస్తూ రాష్ట్రం తరఫున కోర్టుకు అభిప్రాయం తెలపాలని ఈ సమావేశం నిర్ణయించింది. రాజ్యాంగం పేర్కొన్న సామాజిక న్యాయాన్ని ఈ రిజర్వేషన్ విధానం ఉల్లంఘిస్తుందని పేర్కొంది. అఖిలపక్ష భేటీలో తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. EWS కోటా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, సమాజంలో పేదల మధ్య విద్వేషాలకు, కులాల మధ్య వివక్షకు కారణమవుతుందని విమర్శించారు. ‘వారి(బీజేపీ, ఎన్డీయే) ఉద్దేశం ఏమైనా, వారి రాజకీయ ప్రయోజనాలు ఏమైనా, ఆర్థిక స్థితి ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడమనేది సామాజిక న్యాయానికి, రాజ్యాంగానికి వ్యతిరేకం’ అని స్టాలిన్ స్పష్టం చేశారు.

Tamilnadu All-party meet rejects quota to EWS: 3 - 2 తీర్పు

అగ్రవర్ణాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించే 103 వ రాజ్యాంగ సవరణ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టులోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. అనంతరం, ధర్మాసనంలోని ముగ్గురు సభ్యులు ఈ సవరణను సమర్ధించగా, ఇద్దరు సభ్యులు వ్యతిరేకించారు. మెజారిటీ ప్రాతిపదికన 103వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు సమర్దిస్తున్నట్లు తేలింది. దాంతో, దీనిపై రివ్యూ పిటిషన్ వేయాలని తమిళనాడు ప్రభుత్వం సహా పలువురు నిర్ణయించారు.

Tamilnadu All-party meet rejects quota to EWS: ఈ పార్టీల సమర్ధన

ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ అఖిల పక్ష భేటీకి ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే, ఆ పార్టీ మిత్రపక్షం బీజేపీ హాజరు కాలేదు. కాగా, ఈ విషయంలో డీఎంకే విధానాన్ని అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్, వామపక్షాలు, ఎండీఎంకే, వీసీకే పార్టీలు సమర్దించాయి. సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రి కే పొన్ముడి మీడియాతో మాట్లాడుతూ, ఈ భేటీకి అన్నాడీఎంకే హాజరు కాకపోవడాన్ని తప్పుబట్టారు. ఆ పార్టీలో మహా నేతలైన ఎంజీ రామచంద్రన్, జయలలితలు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న నాయకులని గుర్తు చేశారు.

తదుపరి వ్యాసం