తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ulfa Peace Accord: యూఎల్ఎఫ్ఏ తో కేంద్రం, అస్సాం ప్రభుత్వాల శాంతి ఒప్పందం

ULFA peace accord: యూఎల్ఎఫ్ఏ తో కేంద్రం, అస్సాం ప్రభుత్వాల శాంతి ఒప్పందం

HT Telugu Desk HT Telugu

29 December 2023, 21:34 IST

  • ULFA peace accord: అస్సాం మిలిటెంట్ సంస్థతో కేంద్ర ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర హోం  మంత్రి అమిత్ షా సమక్షంలో శుక్రవారం ఈ ఒప్పందం కుదిరింది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ULFA peace accord: కేంద్ర ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ULFA) ల మధ్య శుక్రవారం శాంతి ఒప్పందం కుదిరింది. యూఎల్ఎఫ్ఏ లోని అరబిందా రాజ్ఖోవా నేతృత్వంలోని ప్రత్యేక వర్గంతో కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లుగా బేషరతుగా చర్చలు జరుపుతోంది.

ట్రెండింగ్ వార్తలు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

అమిత్ షా సమక్షంలో

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సమక్షంలో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ULFA) అరబిందా రాజ్ఖోవా వర్గం నేతలు శుక్రవారం తుది విడత చర్చలు జరిపారు. అనంతరం, కేంద్ర ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ULFA) ల మధ్య త్రైపాక్షిక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ULFA) ఇకపై హింసను వీడనాడి, ప్రధాన జనజీవన స్రవంతిలో చేరేందుకు అధికారికంగా అంగీకరించింది.

ఒక వర్గంతోనే ఒప్పందం..

కేంద్ర, అసోం రాష్ట్ర ప్రభుత్వాలతో జరిగిన శాంతి చర్చల్లో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ULFA) అరబిందా రాజ్ఖోవా వర్గం మాత్రమే పాల్గొంది. ఈ శాంతి ఒప్పందంపై కూడా ఈ వర్గం నేతలు మాత్రమే సంతకాలు చేశారు. యూఎల్ఎఫ్ఏ (ULFA) లోని మరో ప్రధాన వర్గమైన పరేష్ బారువా నేతృత్వంలోని వర్గం ఈ చర్చల్లో కానీ, ఈ శాంతి ఒప్పందంలో కానీ పాలు పంచుకోలేదు. ప్రస్తుతం బారువా చైనా-మయన్మార్ సరిహద్దులో నివసిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక అసోం డిమాండ్ తో 1979 లో యూఎల్ఎఫ్ఏ (ULFA) ఏర్పడింది. విద్రోహ, ఉల్లంఘన కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు 1990లో భారత ప్రభుత్వం దీనిని నిషేధించింది. 2011 సెప్టెంబర్ 3న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆపరేషన్ల నిలిపివేత ఒప్పందం కుదిరిన తర్వాత రాజ్ ఖోవా వర్గం ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పాల్గొంది.

అమిత్ షా స్పందన

ఈ ఒప్పందంపై సంతకం చేయడం తనకు సంతోషాన్ని కలిగించిందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. '‘ఈ రోజు అస్సాం భవిష్యత్తుకు ఉజ్వలమైన రోజు కావడం నాకు సంతోషకరమైన విషయం. చాలా కాలం పాటు అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు హింసను ఎదుర్కొన్నాయి. 2014లో ప్రధాని మోదీ ప్రధాని అయిన తర్వాత ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల మధ్య అంతరాన్ని తగ్గించే ప్రయత్నాలు జరిగాయి’’ అన్నారు.

తదుపరి వ్యాసం