తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ukraine: ‘‘ఇబ్బందుల్లో ఉన్నాం.. సాయం చేయండి’’: ప్రధాని మోదీకి జెలెన్స్కీ లేఖ

Ukraine: ‘‘ఇబ్బందుల్లో ఉన్నాం.. సాయం చేయండి’’: ప్రధాని మోదీకి జెలెన్స్కీ లేఖ

HT Telugu Desk HT Telugu

12 April 2023, 15:13 IST

  • Ukraine requests India: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రష్యాతో యుద్ధం (Russia Ukraine war ) కారణంగా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయామని, తమకు మానవాతా సాయం అందించాలని ఆ లేఖలో జెలెన్ స్కీ భారత ప్రధానిని కోరారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

Ukraine requests India: ఉక్రెయిన్ (Ukraine) విదేశాంగ మంత్రి ఎమినీ ఝపరోవా (Emine Dzhaparova) ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు. ఆమె తమ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ భారత ప్రధాని మోదీకి రాసిన ఒక లేఖను కేంద్ర సహాయమంత్రి మీనాక్షి లేఖికి అందజేశారు.

ట్రెండింగ్ వార్తలు

CBSE Class 12 Result 2024: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

Ukraine requests India: సాయం అందించండి..

ఉక్రెయిన్ కు మానవతా సాయం అందించాలని ఆ లేఖలో జెలెన్ స్కీ ప్రధాని మోదీని కోరారు. రష్యాతో యుద్ధం (Russia Ukraine war ) కారణంగా తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుపోయామని, మానవతాకోణంలో సాయం అందించాలని కోరారు. ముఖ్యంగా, వైద్య చికిత్స పరికరాలు, ఔషధాలు పంపించాలని అభ్యర్థించారు. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖితో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఎమినీ ఝపరోవా (Emine Dzhaparova) పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలను చర్చించారు. రష్యా తో యుద్ధం ప్రారంభమైన తరువాత ఉక్రెయిన్ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధి భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి.

Ukraine requests India: యుద్ధాల కాలం కాదు..

2022 డిసెంబర్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Ukraine President Volodymyr Zelensky) భారత ప్రధాని మోదీతో టెలీఫోన్ లో సంభాషించారు. ఆ సమయంలో భారత్ అందించిన సాయంపై ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ఇరువురు నేతలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధ (Russia Ukraine war ) పరిస్థితులను, విపరిణామాలను చర్చించారు. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ చేపట్టి, దౌత్య మార్గాల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని ప్రధాని మోదీ జెలెన్ స్కీ (Ukraine President Volodymyr Zelensky) కి గట్టిగా సూచించారు. ఈ తరువాత, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కూడా ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు. ఇది యుద్ధాలు చేసుకునే కాలం కాదని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పుతిన్ (Vladimir Putin) కు తేల్చి చెప్పారు. మోదీ సూచనలకు పుతిన్ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభిస్తుందన్నారు.

తదుపరి వ్యాసం