తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Uiic Assistant Recruitment 2023: యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్; డిగ్రీ అర్హత; ఇలా అప్లై చేయండి..

UIIC Assistant Recruitment 2023: యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్; డిగ్రీ అర్హత; ఇలా అప్లై చేయండి..

HT Telugu Desk HT Telugu

15 December 2023, 16:03 IST

    • UIIC Assistant Recruitment 2023: యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (United India Insurance Company) లో అసిస్టెంట్స్ పోస్ట్ ల రిక్రూట్మెంట్ (Recruitment) కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో uiic.co.in వైబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Shutterstock/ Representative photo)

ప్రతీకాత్మక చిత్రం

UIIC Assistant Recruitment 2023: యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు UIIC అధికారిక వెబ్‌సైట్ uiic.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

300 పోస్ట్ లు, అర్హత వివరాలు..

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 300 పోస్టులను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC Assistant Recruitment 2023) భర్తీ చేస్తుంది. ఈ పోస్ట్ ల కోసం అభ్యర్థులు డిసెంబర్ 16 నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఆఖరు తేదీ జనవరి 6, 2024. పరీక్షకు 10 రోజుల ముందు హాల్ టికెట్ ను వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అర్హులు. వారి వయస్సు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

Selection Process: ఎంపిక, ఇతర వివరాలు

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) లో అసిస్టెంట్ పోస్టులను ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తుంది. ఈ ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు తమ ప్రాంతానికి చెందిన ప్రాంతీయ భాషలో ప్రావీణ్యానికి సంబంధించిన పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి రూ. 1000 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, కంపెనీ పర్మినెంట్ ఉద్యోగులు రూ. 250 + GST చెల్లిస్తే చాలు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు UIIC అధికారిక వెబ్‌సైట్‌ లోని నోటిఫికేషన్ ను చూడవచ్చు.

తదుపరి వ్యాసం