తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ugc Net December 2023: యూజీసీ నెట్ డిసెంబర్ 2023 రిజల్ట్స్ డేట్ మారింది.. అభ్యర్థులు రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోవచ్చు..

UGC NET December 2023: యూజీసీ నెట్ డిసెంబర్ 2023 రిజల్ట్స్ డేట్ మారింది.. అభ్యర్థులు రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోవచ్చు..

HT Telugu Desk HT Telugu

09 January 2024, 21:08 IST

  • UGC NET December 2023 result: యూజీసీ నెట్ డిసెంబర్ 2023 ఫలితాలను ప్రకటించే తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మార్చింది. యూజీసీ  నెట్ డిసెంబర్ 2023 ఫలితాలను జనవరి 17వ తేదీన ప్రకటిస్తామని మంగళవారం వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UGC NET December 2023 result: యూజీసీ నెట్ డిసెంబర్ 2023 ఫలితాల తేదీ మారింది. యూజీసీ నెట్ డిసెంబర్ 2023 ఫలితాలను జనవరి 17, 2024న ప్రకటించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

తేదీ మారింది..

యూజీసీ నెట్ డిసెంబర్ 2023 (UGC NET December 2023) ఫలితాల తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సవరించింది. సవరించిన తేదీల ప్రకారం యూజీసీ నెట్ డిసెంబర్ 2023 ఫలితాలు జనవరి 17వ తేదీన విడుదల కానున్నాయి. యూజీసీ నెట్ డిసెంబర్ ఎడిషన్ పరీక్షలు రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్స్ అయిన nta.ac.in, లదేా ugcnet.nta.ac.in ల ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. నిజానికి, యూజీసీ నెట్ డిసెంబర్ 2023 ఎడిషన్ ఫలితాలను జనవరి 10వ తేదీన ప్రకటిస్తామని ఎన్టీఏ గతంలో ప్రకటించింది.

కారణం ఏంటి?

యూజీసీ నెట్ డిసెంబర్ 2023 (UGC NET December 2023) ఫలితాలను ప్రకటించే తేదీలను ఎన్టీఏ మార్చడానికి ప్రధాన కారణం చెన్నై, ఆంధ్రప్రదేశ్ లలో వచ్చిన వరదలే. చెన్నై, ఆంధ్ర ప్రదేశ్ ల్లో తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా, అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రీ ఎగ్జామ్ నిర్వహిాంచాల్సి వచ్చింది. దాంతో, ఫలితాలను విడుదల చేసే తేదీని కూడా మార్చాల్సి వచ్చింది. తాజాగా, ఈ ఫలితాలను జనవరి 17వ తేదీన ప్రకటిస్తామని ఎన్టీఏ (NTA) వెల్లడించింది. అభ్యర్థులు జనవరి 17 నుంచి అధికారిక వెబ్ సైట్స్ అయిన nta.ac.in, లదేా ugcnet.nta.ac.in లలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

డిసెంబర్ 6 నుంచి..

2023 డిసెంబర్ 6 నుంచి 2023 డిసెంబర్ 19 వరకు దేశవ్యాప్తంగా 292 నగరాల్లో 83 సబ్జెక్టుల్లో 9,45,918 మంది అభ్యర్థుల కోసం యూజీసీ - నెట్ డిసెంబర్ 2023 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (nta) నిర్వహించింది.

రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోవచ్చు..

  • ముందుగా, అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in ను ఓపెన్ చేయాలి.
  • యూజీసీ నెట్ డిసెంబర్ ఫలితాలపై క్లిక్ చేయాలి.
  • మీ అప్లికేషన్ నెంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • మీ రిజల్ట్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.
  • రిజల్ట్ ను డౌన్ లోడ్ చేసుకుని, ప్రింటౌట్ తీసుకోండి.
  • తాజా అప్డేట్ కోసం అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ https://ugcnet.nta.ac.in/.Candidates ను చెక్ చేయవచ్చు. లేదా ఎన్టీఏ హెల్ప్ లైన్ నంబర్లు 011- 40759000/69227700 లకు కాల్ చేయవచ్చు.

తదుపరి వ్యాసం