UGC NET December 2023: యూజీసీ నెట్ డిసెంబర్ ఎడిషన్ నోటిఫికేషన్ విడుదల; అప్లై చేయండి ఇలా..
UGC NET December 2023: ఈ సంవత్సరం డిసెంబర్ లో నిర్వహించే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET 2023) నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.
UGC NET December 2023: యూజీసీ నెట్ డిసెంబర్ ఎడిషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను ఎన్టేఏ విడుదల చేసింది. డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 22వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 28.
లాస్ట్ డేట్ అక్టోబర్ 28
యూజీసీ నెట్ డిసెంబర్ ఎడిషన్ కు అభ్యర్థులు ugcnet.nta.nic.in వెబ్ సైట్ ద్వారా అక్టోబర్ 28 (సాయంత్రం 5 గంటల వరకు) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజును అక్టోబర్ 29 రాత్రి 11:50 వరకు చెల్లించవచ్చు. అప్లికేషన్ విండో క్లోజ్ అయిన తరువాత, అక్టోబర్ 30, అక్టోబర్ 31 తేదీలలో ఎడిట్ విండో ఓపెన్ అవుతుంది. ఆ ఎడిట్ విండో ద్వారా అక్టోబర్ 30, 31 తేదీల్లో తమ అప్లికేషన్ ఫామ్స్ లో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రాల నగరాల వివరాలను నవంబర్ చివరి వారంలో వెల్లడిస్తారు. అడ్మిట్ కార్డ్స్ డిసెంబర్ మొదటి వారం నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ పరీక్ష డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 22 జరుగుతుంది. ఆన్సర్ కీ, రిజల్ట్ ను ప్రకటించే తేదీలను ఇంకా వెల్లడించలేదు.
పరీక్ష ఫీజు, ఇతర వివరాలు..
ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా..
- జనరల్/అన్ రిజర్వ్‌డ్: రూ. 1,150
- EWS/OBC-NCL: రూ. 600
- SC/ST/PwD/థర్డ్ జెండర్: రూ 325 లను చెల్లించాలి.
- ఒక అభ్యర్థి ఒక దరఖాస్తును మాత్రమే సబ్మిట్ చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు సమర్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ తెలిపింది.
- అప్లై చేయడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, అభ్యర్థులు 011-40759000/011 - 69227700 నంబర్‌లో సంప్రదించవచ్చు లేదా మరింత స్పష్టత కోసం ugcnet@nta.ac.inలో ఈ-మెయిల్ చేయవచ్చు.
- Here is the link to the notification.