తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : సర్​ప్రైజ్​ అని చెప్పి.. లవర్​ని కట్టేసి, సజీవదహనం చేసిన ట్రాన్స్​జెండర్​!​

Crime news : సర్​ప్రైజ్​ అని చెప్పి.. లవర్​ని కట్టేసి, సజీవదహనం చేసిన ట్రాన్స్​జెండర్​!​

Sharath Chitturi HT Telugu

25 December 2023, 14:49 IST

  • Chennai crime news : ఓ ట్రాన్స్​జెండర్​.. తన లవర్​ని అతి కిరాతకంగా చంపిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. సర్​ప్రైజ్​ అంటూ.. కళ్లకు గంతలు కట్టి, చేతులకు చెయిన్​ బిగించి, పెట్రోల్​ పోసి చంపేశాడు!

లవర్​ని కట్టేసి, సజీవదహనం చేసిన ట్రాన్స్​జెండర్
లవర్​ని కట్టేసి, సజీవదహనం చేసిన ట్రాన్స్​జెండర్

లవర్​ని కట్టేసి, సజీవదహనం చేసిన ట్రాన్స్​జెండర్

Chennai crime news : తమిళనాడులో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 24ఏళ్ల మహిళను, ఓ ట్రాన్స్​జెండర్​ చిత్రహింసలకు గురిచేసి చంపేశాడు. బ్లేడ్​తో ఆమె శరీరాన్ని కట్​ చేసి, పెట్రోల్​ పోసి నిప్పంటించాడు!

ట్రెండింగ్ వార్తలు

CBSE Class 12 Result 2024: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

ఇదీ జరిగింది..

మీడియా కథనాల ప్రకారం.. 26ఏళ్ల పండి మహేశ్వరి, 24ఏళ్ల ఆర్​ నందినికి ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరు కలిసి మధురైలో చదువుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి థొరైపక్కమ్​లోని ఓ కంపెనీలో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. మహేశ్వరి సెక్స్​- ఛేంజ్​ ఆపరేషన్​ చేసుకుని.. తన పేరును వేట్రిమారన్​గా మార్చుకోవడం జరిగింది. అయితే.. నందినిని పెళ్లి చేసుకోవడం కోసమే, మహేశ్వరి.. తన జెండర్​ని మార్చుకుని అబ్బాయిగా మారినట్టు తెలుస్తోంది.

ఇలా కొంతకాలం గడిచింది. నందినికి వేరే వ్యక్తిపై ఇష్టం పెరిగినట్టు వేట్రిమారన్​ గమనించాడు. కోపంతో ఊగిపోయిన ట్రాన్స్​జెండర్​.. నందినిని చంపేయాలని ఫిక్స్​ అయ్యాడు.

బర్త్​డే సర్​ప్రైజ్​ అని పిలిచి..

ఇటీవలే.. నందిని 24వ పుట్టిన రోజు సెలబ్రేషన్స్​ జరగాల్సి ఉంది. అందుకు ఒక రోజు ముందు.. నందినిని కలవాలని పిలిచాడు వేట్రిమారన్​. కేలంబక్కమ్​కు సమీపంలోన థలంబూర్​కు తీసుకెళ్లాడు. బర్త్​డే సర్​ప్రైజ్​ ఇస్తానంటూ.. ఆమె కళ్లకు గంతలు కప్పాడు. వేట్రిమారన్​ అసలు కుట్ర తెలుసుకోలేకపోయిన నందిని.. అందుకు అతడిని నమ్మింది.

కళ్లకు గంతలు కట్టిన వేట్రిమారన్​.. ఆ తర్వాత, ఆమె చేతులకు చెయిన్​ బిగించాడు. ఆమె స్పందించేలోపే.. బ్లేడ్​తో నందిని శరీరాన్ని కట్​ చేసి.. ఆమెపై పెట్రోల్​ పోసి, నిప్పంటించాడు. నందిని అరుపులు వినపడగానే.. స్థానికులు ఆమెవైపు పరుగులు తీశారు. ఆమె శరీరానికి అంటుకున్న మంటలను ఆర్పి, నందినిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఆధారాలను సేకరించారు. ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసి.. నిందితుడు వేట్రిమారన్​ని అరెస్ట్​ చేశారు. అనంతరం జ్యుడీషియల్​ కస్టడీకి తరలించారు.

"వాళ్లిద్దరు ఫ్రెండ్స్​. చెన్నైలో కలిసి జీవిస్తున్నారు. లైంగిక దాడి జరిగిందా? అన్నది తెలియలేదు. గతంలో ఎప్పుడైనా నందినిపై వేట్రిమారన్​ దాడి చేసి హింసించాడా? అన్నది తెలియాల్సి ఉంది. నిందితుడిని అరెస్ట్​ చేశాము. ఘటనపై దర్యాప్తు చేపట్టాము," అని పోలీసులు వెల్లడించారు.

తదుపరి వ్యాసం