తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Wrestlers Protest : విధుల్లో చేరిన రెజ్లర్లు.. మరి నిరసనల పరిస్థితేంటి?

Wrestlers protest : విధుల్లో చేరిన రెజ్లర్లు.. మరి నిరసనల పరిస్థితేంటి?

Sharath Chitturi HT Telugu

05 June 2023, 16:16 IST

    • Wrestlers protest : బ్రిజ్​ భూషణ్​కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో కీలక పాత్ర పోషిస్తున్న పలువురు రెజ్లర్లు.. తిరిగి ఉద్యోగాల్లో చేరారు. మరోవైపు.. రెజ్లర్లు అమిత్​ షాను కలిసినట్టు తెలుస్తోంది.
విధుల్లో చేరిన రెజ్లర్లు.. మరి నిరసనల పరిస్థితేంటి?
విధుల్లో చేరిన రెజ్లర్లు.. మరి నిరసనల పరిస్థితేంటి? (HT_PRINT)

విధుల్లో చేరిన రెజ్లర్లు.. మరి నిరసనల పరిస్థితేంటి?

Wrestlers protest : రెజ్లర్ల నిరసన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెజ్లింగ్​ ఫెడరేషన్​ చీఫ్​ బ్రిజ్​ భూషణ్​ శరణ్​ సింగ్​కు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న రెజ్లర్లు సాక్షి మాలిక్​, వినేశ్​ ఫోగట్​, బజరంగ్​ పునియాలు.. తిరిగి ఉద్యోగాల్లో చేరినట్టు తెలుస్తోంది. మరోవైపు బ్రిజ్​ భూషణ్​పై రెజ్లర్లు శనివారం రాత్రి అమిత్​ షాతో భేటీ అయినట్టు సమాచారం!

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

విధుల్లో చేరారు కానీ..

మహిళా రెజ్లర్లు, మైనర్లపై బ్రిజ్​ భూషణ్​ లైంగిక దాడికి పాల్పడినట్టు రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. జనవరిలో నిరసనలు చేసి కొన్ని రోజుల తర్వాత విరమించుకున్నారు. కానీ ఏప్రిల్​ నెలల ఆందోళనలను ఉద్ధృతం చేశారు. బ్రిజ్​ భూషణ్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని, అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేస్తూ వచ్చారు. అప్పటి వరకు కదలమంటూ ఢిల్లీ జంతర్​మంతర్​ వద్ద క్యాంప్​ను ఏర్పాటు చేసుకున్నారు. కాగా.. మే నెల చివర్లో ఈ క్యాంప్​ను పోలీసులు తొలగించారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు, అంటే మే 31.. సాక్షి మాలిక్​, వినేశ్​ ఫోగట్​, బజరంగ్​ పునియాలు తమ తమ రైల్వే ఉద్యోగాల్లో చేరారు.

అయితే.. విధుల్లో చేరినంత మాత్రాన తాము నిరసనలకు దూరం జరిగినట్టు కాదని రెజ్లర్లు చెబుతున్నారు.

ఇదీ చూడండి:- Wrestler's FIR: రెజ్లర్లపై లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన, బెదిరింపులు.. బ్రిజ్ భూషణ్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో ఆరోపణలు

Wrestlers protest latest news : "అవును. రైల్వేశాఖ ఉద్యోగాల్లో తిరిగి చేరాము. అంతమాత్రాన వెనకడుగు వేస్తున్నట్టు కాదు. మా భవిష్యత్తు కార్యచరణను రచిస్తున్నాము. మేము న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాము," అని సాక్షి మాలిక్​ వెల్లడించారు.

అమిత్​ షాతో భేటీ..

ఆందోళనకు దిగిన రెజ్లర్లు గత శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో భేటీ అయినట్టు తెలుస్తోంది. బ్రిజ్​ భూషణ్​పై నిస్పక్షపాత దర్యాప్తు జరగాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. 'చట్టం అందరికి ఒకే విధంగా ఉంటుంది. చట్టం దాని పని దానిని చేసుకోనివ్వండి,' అని రెజ్లర్లకు అమిత్​ షా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే.. అమిత్​ షా స్పందనపై రెజ్లర్లు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

Wrestlers meet Amit Shah : “శనివారం రాత్రి అమిత్​ షాతో భేటీ అయ్యాము. ఆయన నుంచి సరైన స్పందన రాలేదు. అందుకే మేము సమావేశం నుంచి బయటకి వచ్చేశాము. నిరసనల్లో భాగంగా భవిష్యత్తు కార్యచరణను రచిస్తున్నాము,” అని సాక్షి మాలిక్​ భర్త, రెజ్లర్​ సత్యవ్రత్​​ కడియన్​ తెలిపారు.

తదుపరి వ్యాసం