తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Wipro Share Value: ఐదు సార్లు బోనస్ షేర్లు ఇచ్చిన ఐటీ సంస్థ

Wipro share value: ఐదు సార్లు బోనస్ షేర్లు ఇచ్చిన ఐటీ సంస్థ

HT Telugu Desk HT Telugu

03 September 2022, 21:47 IST

  • రిటైల్ మదుపరులు ఏ సంస్థలోనైనా పెట్టుబడి పెట్టాలనుకునే సమయంలో ముఖ్యంగా చూసేవి.. ఆ సంస్థ షేర్ ధరలో క్రమానుగత పెరుగుదలతో పాటు డివిడెండ్, బోనస్ షేర్ల ప్రకటన.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతీయ ఐటీ కంపెనీల్లో విప్రో ది ప్రముఖ స్థానం. నిజానికి విప్రో సంస్థ కేవలం ఐటీ కే పరిమితం కాలేదు. ఎఫ్ఎంసీజీ సహా వివిధ రంగాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

Wipro share value: ఫేవరెట్ స్టాక్

మదుపరులు, ముఖ్యంగా భారతీయ మదుపరులు దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం చూసే సంస్థల్లో ముఖ్యమైనది విప్రో. ఈ సంస్థ క్రమం తప్పకుండా డివిడెండ్లను ప్రకటిస్తూ ఉంటుంది. అయితే, ప్రస్తుతం విప్రో షేరు ధర లో పెరుగుదల కనిపించడం లేదు.

Wipro share value: ఐదుసార్లు

షేరు హోల్డర్లకు ఐదు సార్లు బోనస్ షేర్లు ప్రకటించిన సంస్థగా విప్రో కు రికార్డు ఉంది. చివరగా 2019 మార్చిలో 1:3 ప్రకారం షేర్ హోల్డర్లకు బోనస్ షేర్లను విప్రో ప్రకటించింది. అంటే షేర్ హోల్డర్ వద్ద మూడు షేర్లు ఉంటే, ఒక షేరును బోనస్ గా అందించింది. అంతకుముందు జూన్ 2017లో 1:1 రేషియోలో, జూన్ 2010లో 2:3 రేషియోలో, ఆగస్ట్ 2005లో 1:1 రేషియోలో, జూన్ 2004 లో 2:1 రేషియోలో బోనస్ షేర్లను విప్రో తమ షేర్ హోల్డర్లకు అందించింది.

Wipro share value: ఆదాయంతగ్గుతోంది

భారతీయ ఐటీ కంపెనీల్లో విప్రో కు ప్రత్యేక స్థానం ఉంది. కానీ గత కొంత కాలంగా వివిధ కారణాల వల్ల ఈ సంస్థ ఆదాయం తగ్గుతోంది. షేర్ వాల్యూ కూడా క్రమంగా తగ్గుతోంది. 2022లో విప్రో షేర్ వాల్యూ గత సంవత్సరం కన్నా 28% తగ్గింది. 2022 తొలి త్రైమాసికంలో, గత సంవత్సరం అదే కాలానితో పోలిస్తే.. నెట్ ప్రాఫిట్ రూ. 3,232 కోట్ల నుంచి రూ. 2,563 కోట్లకు అంటే, 20.7% తగ్గింది. విప్రో ప్రధాన ఆదాయం ఐటీ సర్వీసెస్ నుంచే వస్తుంది.

తదుపరి వ్యాసం