తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mysterious Crime | తనను చంపిన వ్యక్తిని పట్టించిన ఆత్మ.. ప్రపంచంలో ఇలా.. ఇదే మెుదటిసారి

Mysterious Crime | తనను చంపిన వ్యక్తిని పట్టించిన ఆత్మ.. ప్రపంచంలో ఇలా.. ఇదే మెుదటిసారి

Anand Sai HT Telugu

08 April 2022, 15:23 IST

    • కొన్ని క్రైమ్స్ నమ్మలేనివిగా ఉంటాయి. అసలు అంతుపట్టవు. కానీ అవి జరిగిన పరిస్థితి చూస్తే.. నిజమే కదా అనిపిస్తుంది. అలాంటిదే ఈ రియల్ క్రైమ్ స్టోరీ. తనను చంపేసింది ఎవరో ఆత్మ చెప్పడంతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నమ్మట్లేదా? అయితే .. ఈ క్రైమ్ చదవాల్సిందే..
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

ప్రతీకాత్మక చిత్రం

అది.. 1977. అమెరికా చికాగోలోని ఇల్లినాయిస్‌ ప్రాంతం. తెరెసిటా బసా అనే మహిళ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తుంది. ఆమెను తన అపార్ట్ మెంట్ లో ఎవరో రేప్ చేసి, చంపేసి, కాల్చేశారు. తాను పడుకున్న బెడ్ మీదే.. నగ్నంగా.. అలాగే కాలిపోయింది. రొమ్ములో ఓ కత్తి కూడా దిగి ఉంది. పోలీసులు వెళ్లేసరికి ఇది క్రైమ్ సీన్. వెళ్లిన పోలీసులకు చోరీ జరిగిందా అనే అనుమానం వచ్చింది. చూస్తే.. బీరువాలో నగలు లేవు. చోరీ జరిగింది అనుకున్నారు. కానీ ఎవరు చేశారు? నగల విషయం ఎలా తెలుసు? ఈ కేసు చుట్టు ఇన్ని ప్రశ్నలు వచ్చి చేరాయి.

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

పోలీసులు.. అసలు క్రైమ్ జరిగిన రోజు నుంచి ఏం జరిగింది అని ఆరా తీశారు. 1977 ఫిబ్రవరి 21 రాత్రి 9 గంటలకు ఫైర్ డిపార్ట్‌మెంట్‌కి ఫోన్ వచ్చింది. అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో మంటలు వస్తున్నట్టు చెప్పారు. ఫైర్ డిపార్ట్ మెంట్ వాళ్లు వచ్చి.. వెంటనే మంటలు ఆర్పేశారు. లోపలికి వచ్చి చూశాక.. బెడ్ పై.. బసా కాలిపోయి ఉంది. అన్ని వైపుల నుంచి.. పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. చివరకు ఆమె బాయ్ ఫ్రెండ్ ని కూడా గట్టిగా ప్రశ్నించారు. కానీ సమాధానం ఏదీ లేదు. దీంతో కేసు మిస్టరీగా మారింది.

ఇక చేసేదేమి లేక కేసును డిటెక్టివ్ గా అప్పగించారు పోలీసులు. బసాకు తెలిసిన వాళ్లను పరిశీలించాడు. వాళ్లకి తెలియకుండా.. అబ్జర్వ్ చేసేవాడు డిటెక్టివ్. కానీ ఎలాంటి క్లూ దొరకలేదు. ఓ వైపు.. పోలీసులు, మరోవైపు డిటెక్టివ్ ఎంతగా వెతికినా.. అస్సలు చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఇక కేసును కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.

సరిగా బసా చనిపోయాక ఐదారు నెలలకు ఆమె స్నేహితురాలు.., హాస్పిటల్ కో-వర్కర్ రెమీచూవాకు ఓ కల వచ్చింది. ఇదే విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది . కలలో బసా కనిపించింది అనేసరికి.. రెమీచూవా భర్త తెల్లమెుహం వేశాడు. నవ్వుకున్నాడు. తన భార్య ఏదేదో మాట్లాడుతుందని అనుకున్నాడు. కానీ బసా స్నేహితురాలు.. తన కల గురించి పోలీసులకు చెప్పాల్సిందేనని.. పట్టుబట్టింది. కానీ రేమి భర్త జాయ్ చెప్పలేదు. లైట్ తీసుకున్నాడు.

ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ రెమీచూవా.. రాత్రి నిద్రలో కాస్త వింతగా ప్రవర్తించింది. వేరే వాయిస్ లో.. మాట్లాడుతుండగా.. ఆమె భర్త జాయ్ వింటున్నాడు.. నేను రెమీని కాదు బసాని. నన్ను అలోన్ షోవ్రీనే చంపాడు. అతను ఎవరో కాదు.. మా హాస్పిటల్ లో పని చేసే.. ఎలక్ట్రీషియన్‌. నన్ను చంపేసి.. నా నగలు ఎత్తుకుపోయాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌కి ఇచ్చాడు.. అని వాయిస్ వినిపించింది. వెంటనే.. నిద్రలేపి.. ఏం మాట్లాడుతున్నావ్.. అని రెమీని అడిగాడు జాయ్. కానీ తనకు ఏం గుర్తు లేదు అని ఆమె తెలిపింది. ఈ విషయాన్నే.. డిటెక్టివ్ కు చెప్పారు వాళ్లు. డిటెక్టివ్ మెుదట్లో నమ్మలేదు. కానీ బసా స్నేహితురాలు రెమీ చెప్పిన కోణంలో ఆరా తీస్తే.. ఫలితం ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు.

ఏదైతే అదే జరిగిందని.. మళ్లీ కేసు వెంట పడ్డాడు డిటెక్టివ్. హాస్పిటల్ వెళ్లి.. అలోన్ షోవ్రీ గురించి ఆరా తీయగా.. ఆ వ్యక్తి ఉన్నట్టు తెలిసింది. హత్య జరిగిన రోజున.. బసా దగ్గరకు వెళ్లాడా అని ఆరా తీయగా నిజమేనని తేలింది. మరోవైపు షోవ్రి గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా తెలుసుకున్నాడు డిటెక్టివ్. ఇక కేసులో.. ఓ అడుగు పడినట్టైంది. పనిలో పనిగా.. షోవ్రీ గర్ల్ ఫ్రెండ్ ను కలిసి అడగ్గా.. తన బాయ్ ఫ్రెండ్ నగలు ఇచ్చాడు అని చెప్పిందామే.

ఇక కేసుపై క్లారిటీ వచ్చింది. నేరుగా వెళ్లి అలోన్ షోవ్రీని ప్రశ్నించాడు డిటెక్టివ్. ఆ రోజు రాత్రి బాసా ఇంటికి టీవీ రిపేర్ కోసం వెళ్లినట్టు చెప్పాడు నిందితుడు. కానీ తిరిగి ఇంటికి వచ్చినట్టుగా వివరించాడు. ఎంత ప్రశ్నించినా.. అసలు నిజం చెప్పలేదు. చేసేదేమీ లేక.. బసా నగలను నీ గర్ల్ ఫ్రెండ్ కు ఎలా ఇచ్చావ్ అని అడగ్గానే.. షాక్ అయ్యాడు షోవ్రీ. ఇక అసలు విషయం తెలిసిందని అర్థమైంది. టీవీ రిపేర్ చేసేందుకు.. బసా ఇంటికి వెళ్లాలని.. ఆమె బీరువాలో నగలు సర్దుతుండడాన్ని చూసి.. ఎలాగైనా కొట్టేయాలనుకున్నట్టు చెప్పాడు షోవ్రీ.

ఇందులో భాగంగానే.. ఆమెను చంపేయాల్సి వచ్చిందని.. అనుమానం రాకుండా ఉండేందుకు.. బసా మీద రేప్ జరిగినట్టుగా క్రియేట్ చేశానని.. తెలిపాడు. నగలు తీసుకుని పారిపోతూ.. అపార్ట్ మెంట్ కు నిప్పంటించిన్నట్టు చెప్పాడు. రెమీ, జాయ్ దంపతులు కూడా ఇది విని ఆశ్చర్యపోయారు. అంటే.. బసా ఆత్మే క్లూ ఇచ్చిందని.. అందరూ షాక్ అయ్యారు.

ఆ తర్వాత అలోన్ షోవ్రీకి శిక్ష పడింది. 14 ఏళ్లు జైలులో ఉండి బయటకు వచ్చాడు. ఈ కేసు అప్పట్లో సంచలనం. ఇప్పటికి.. చాలా మందికి అంతుచిక్కదు. ఆత్మ వచ్చి ఎలా క్లూ ఇచ్చిందా అని. ఈ క్రైమ్ స్టోరీపై వాయిస్ ఫ్రమ్ ది గ్రేవ్ అనే సినిమా కూడా వచ్చింది. ఎప్పుడు విన్నా.. ఈ కేసు చాలా మందికి ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటుంది.

 

టాపిక్

తదుపరి వ్యాసం