తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Telangana Rains : తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్​!

Telangana Rains : తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్​!

Sharath Chitturi HT Telugu

29 July 2023, 10:15 IST

  • Telangana Rains : తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. నాలుగు రోజుల పాటు వరుణుడి ప్రభావం ఉంటుందని స్పష్టంచేసింది.

తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్​!
తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్​!

తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్​!

Telangana Rains alert : భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు మరో బ్యాడ్​ న్యూస్​! రాష్ట్రంతో పాటు ఉత్తర భారతంలో మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆగస్టు 1 వరకు.. ఉత్తరాఖండ్​, హిమాచల్​ ప్రదేశ్​, దిల్లీ, ఉత్తర్​ ప్రదేశ్​, రాజస్థాన్​, మహారాష్ట్ర, తెలంగాణ, బిహార్​, ఝార్ఖండ్​ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు. అయితే.. ఆదివారం నుంచి తూర్పు భారతంతో పాటు ఒడిశా, పశ్చిమ్​ బెంగాల్​లో వర్షాలు తగ్గుముఖం పడతాయి.

దేశంపై వరుణుడి ప్రభావం ఇలా..

Telangana floods : తెలంగాణలో గత వారం రోజులు కురిసిన వర్షాలకు ప్రజలు అల్లాడిపోయారు. అనేక నదులు ఉప్పొంగుతున్నాయి. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు 18మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం నాడు కొన్ని ప్రాంతాల్లో మోస్తారు, ఉరుములతో కూడిన వానలు పడతాయని ఐఎండీ పేర్కొంది.

దిల్లీలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా శనివారం ఉదయం అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై వరద నీరు చేరుకుంది. శనివారం మోస్తారు వర్షం పడుతుందని ఐఎండీ పేర్కొంది.

ఇదీ చూడండి:- Delhi rains: ఢిల్లీని వీడని వర్షం; నీటిలోనే ముంపు ప్రాంతాలు

Hyderabad rains : ఉత్తరాఖండ్​, హిమాచల్​ ప్రదేశ్​, హరియాణా, ఛండీగఢ్​, దిల్లీ, తూర్పు రాజస్థాన్​లో శనివారం, తూర్పు ఉత్తర్​ ప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి ఆగస్టు 1 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక పశ్చిమ భారతంలోని గోవా, కోంకణ్​, మధ్య మహారాష్ట్ర ప్రాంతాలపై నలుగు రోజుల పాటు వరుణుడి ప్రభావం ఉంటుంది.

ఒడిశాలో ఈ నెల 31 వరకు, పశ్చిమ్​ బెంగాల్​లోని గంగా నది ప్రాంతంలో ఈ నెల 29 వరకు, సిక్కింలో 29 వరకు వర్షాలు పడతాయని, ఆ తర్వాత వానలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది.

తదుపరి వ్యాసం