తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cyclone Michaung: తమిళనాడుకు భారీ వర్ష సూచన; రెడ్ అలర్ట్ జారీ

Cyclone Michaung: తమిళనాడుకు భారీ వర్ష సూచన; రెడ్ అలర్ట్ జారీ

HT Telugu Desk HT Telugu

03 December 2023, 21:14 IST

  • Cyclone Michaung: మిచౌంగ్ తుపాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నై సహా పలు ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

తమిళనాడులోని తిరువళ్లూరులో సహాయ చర్యలు
తమిళనాడులోని తిరువళ్లూరులో సహాయ చర్యలు (ANI )

తమిళనాడులోని తిరువళ్లూరులో సహాయ చర్యలు

Cyclone Michaung: ఉత్తర కోస్తా తమిళనాడు మరియు పుదుచ్చేరిలలో ఆదివారం రాత్రి, సోమవారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ (red alert) జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మిచౌంగ్ తుపాను

మిచౌంగ్ (Cyclone Michaung) తుపాను కారణంగా చెన్నై తో పాటు తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షపాతం ముప్పును బట్టి ఆయా ప్రాంతాలకు రెడ్, యెల్లో, ఆరెంజ్ అలర్ట్ లను ప్రకటించింది. ముఖ్యంగా వెల్లూరు, చెంగల్పట్టు, విల్లుపురం, తిరువణ్ణామలై, కల్లక్కురిచ్చి, కడలూరు, కాంచీపురంలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను కారణంగా తమిళనాడులోని పలు తీర ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రమాద భరిత తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. నాగపట్టనం తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగుస్తున్నాయి. చెంగల్పట్టు తదితర ప్రాంతాల్లో వర్షాల కారణంగా వరి పంట ను రైతులు నష్టపోయారు.

డిసెంబర్ 5న తీరం దాటే అవకాశం

మిచౌంగ్ తుపాను ఆంధ్ర ప్రదేశ్ తీరంలో, నెల్లూరు, మచిలీ పట్నంల మధ్య డిసెంబర్ 5 వ తేదీన తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 150 కిమీల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది. ఈ పెను తుపానును ఎదుర్కోవడానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పలు చర్యలు చేపట్టాయి. తీర ప్రాంత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశాయి. ముప్పు ఉన్నప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం చేపట్టాయి.

తదుపరి వ్యాసం