తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  రాజకీయ పార్టీని ప్రకటించిన తమిళ నటుడు విజయ్.. పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం

రాజకీయ పార్టీని ప్రకటించిన తమిళ నటుడు విజయ్.. పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం

HT Telugu Desk HT Telugu

02 February 2024, 13:50 IST

    • తమిళగ వెట్రి కళగం పార్టీతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు నటుడు విజయ్ ప్రకటించారు.
పార్టీ పేరు ప్రకటించిన నటుడు విజయ్
పార్టీ పేరు ప్రకటించిన నటుడు విజయ్

పార్టీ పేరు ప్రకటించిన నటుడు విజయ్

తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఫిబ్రవరి 2న ప్రకటించారు. తన పార్టీకి తమిళగ వెట్రి కళగం అని నామకరణం చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో తాను కొత్తగా స్థాపించిన పార్టీ పోటీ చేయదని, మరే పార్టీకి మద్దతివ్వబోమని జనరల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉటంకిస్తూ విజయ్ స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

విజయ్ ప్రకటన - 2024 ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, ఏ పార్టీకి మద్దతివ్వబోమని స్పష్టం చేశారు. జనరల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

తన సినిమాల విడుదలకు ముందే నటుడు విజయ్ సినిమాకు సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేవి. సినిమాల్లో పొలిటికల్ డైలాగులు కూడా ఉండేవి. దీంతో ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త కోలీవుడ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతూ వస్తోంది.

అందుకనుగుణంగా నటుడు విజయ్ కూడా అంబేడ్కర్ జయంతి రోజున అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయడం, మొత్తం 234 నియోజకవర్గాల్లో 'దళపతి విజయ్ వన్ డే లంచ్ సర్వీస్' అమలు చేయడం, రక్తదానం, విద్యార్థులకు సాయంత్రం తరగతులు, లైబ్రరీ, వరద సహాయక చర్యలు, వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.

రాజకీయ పార్టీ పెట్టే ప్రకటన నెల రోజుల్లో వస్తుందని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో విజయ్ చెప్పారు. ఈ సమావేశంలో నటుడు విజయ్ బూత్ కమిటీల బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

తన రాజకీయ పార్టీలో కోటి మంది సభ్యులను చేర్చుకోవాలని విజయ్ నిర్ణయించుకున్నారు. పార్టీలో చేరాలనుకునే వారి కోసం విజయ్ కొత్త యాప్ లాంచ్ చేసినట్లు సమాచారం.

టాపిక్

తదుపరి వ్యాసం