తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  200 Cr Worth Drugs| పాక్ బోట్ లో కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

200 cr worth drugs| పాక్ బోట్ లో కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

HT Telugu Desk HT Telugu

15 September 2022, 6:48 IST

  • 200 crore worth drugs: గుజరాత్ తీరంలో భారతీయ సముద్ర జలాల్లో పాక్ బోటు నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను ఇండియన్ కోస్టల్ గార్డ్స్ స్వాధీనం చేసుకుంది. ఇందుకు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తో కలిసి జాయింట్ ఆపరేషన్ చేసింది. 

డ్రగ్స్ తో పాక్ జాతీయులు
డ్రగ్స్ తో పాక్ జాతీయులు

డ్రగ్స్ తో పాక్ జాతీయులు

200 crore worth drugs: భారత సముద్ర జలాల్లోకి అక్రమంగా వచ్చిన పాకిస్తాన్ బోటు ‘అల్ తయ్యస’ నుంచి రూ. 200 కోట్ల విలువైన 40 కేజీల హెరాయిన్ ను తీర గస్తీ దళం స్వాధీనం చేసుకుంది.

200 crore worth drugs: పాక్ బోటు

గుజరాత్ లోని కచ్ తీరంలో బుధవారం Indian Coast Guard (ICG), Gujarat Anti-Terrorist Squad (ATS) ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఇంటర్నేషనల్ మారిటైమ్ బోర్డర్ లైన్ (International Maritime Border Line IMBL) నుంచి భారత జలాల్లోకి ప్రవేశించిన పాక్ బోటును అడ్డుకుని, అందులోని ఆరుగురు పాక్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ బోటులో జరిపిన సోదాల్లో రూ. 200 కోట్ల విలువైన 40 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.

200 crore worth drugs: గుజరాత్ తీరంలో

శత్రు దేశ బోట్లను, నౌకలను గుర్తించి, అడ్డుకునేందుకు వీలుగా భారత తీర గస్తీ దళం వ్యూహాత్మకంగా C-408, C-454 అనే రెండు interceptor class of ships ను గుజరాత్ తీరంలో మోహరించింది. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం అర్ధరాత్రి తరువాత పాక్ నుంచి వచ్చిన బోటు IMBL కు 6 కిమీల లోపల భారత సముద్ర జలాల్లో అనుమానాస్పదంగా తిరగడాన్ని ఆ ఇంటర్సెప్టార్ షిప్స్ గుర్తించాయి. అవి ఇచ్చిన సమాచారంతో ఆ బోటును తీర గస్తీ దళం స్వాధీనం చేసుకుంది.

200 crore worth drugs: పంజాబ్ లోని జైలు నుంచి ఈ ఆర్డర్

ఈ డ్రగ్స్ పంజాబ్ కు తరలించాలన్న ఉద్దేశంతో వారు వచ్చినట్లు విచారణలో తేలింది. పంజాబ్ లోని జైళ్లలో పెద్ద ఎత్తున డ్రగ్ మాఫియా పని చేస్తోందని గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా వెల్లడించారు. ఫరీద్ కోట్, కపుర్తల జైళ్ల లోని ఖైదీలు పాక్ నుంచి డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు సమాచారం ఉందన్నారు. వారు మొబైల్ ఫోన్ ద్వారా వాట్సాప్ కాల్స్ చేసి డ్రగ్స్ కు ఆర్డర్స్ ఇస్తున్నారని వివరించారు. Amritsar జైళ్లోని ఒక నైజీరియన్, కపుర్తల జైళ్లోని మరో వ్యక్తి ఇచ్చిన ఆర్డర్ల మేరకు ఈ డ్రగ్స్ వచ్చినట్లు ప్రాథమిక సమాచారం ఉందని డీజీపీ తెలిపారు.

తదుపరి వ్యాసం