తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sc Serious On Baba Ramdev | బాబా రామ్‌దేవ్‌పై సుప్రీంకోర్టు సీరియ‌స్‌

SC serious on Baba Ramdev | బాబా రామ్‌దేవ్‌పై సుప్రీంకోర్టు సీరియ‌స్‌

HT Telugu Desk HT Telugu

23 August 2022, 14:56 IST

  • ప్ర‌ముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్‌పై సుప్రీంకోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. అల్లోప‌తి వైద్యంపై, అల్లోప‌తి వైద్యుల‌పై బాబా రామ్‌దేవ్ చేసిన అనుచిత‌ వ్యాఖ్య‌లు స‌రికావ‌ని వ్యాఖ్యానించింది.

యోగా గురు బాబా రామ్‌దేవ్‌
యోగా గురు బాబా రామ్‌దేవ్‌

యోగా గురు బాబా రామ్‌దేవ్‌

SC serious on Baba Ramdev | ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ దాఖ‌లు చేసిన ఒక పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అల్లోప‌తిపై బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ``బాబా రామ్‌దేవ్ యోగాకు ప్రాచుర్యం క‌ల్పించార‌న‌డంలో సందేహం లేదు. అలా అని, మిగ‌తా వైద్య‌ విధానాల‌ను విమ‌ర్శించ‌కూడ‌దు క‌దా`` అని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

SC serious on Baba Ramdev | కరోనా స‌మ‌యంలో..

క‌రోనా రెండో వేవ్ స‌మ‌యంలో బాబా రామ్‌దేవ్‌ కోవిడ్ చికిత్స కోసం ప‌తంజ‌లి సంస్థ నుంచి ఔష‌ధాల‌ను విడుద‌ల చేశారు. ఆ స‌మ‌యంలో అల్లోప‌తి వైద్యాన్ని, అల్లోప‌తి వైద్యుల‌ను విమ‌ర్శిస్తూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనా మ‌ర‌ణాల‌కు అల్లోప‌తి వైద్య విధాన‌మే, అల్లోప‌తి వైద్యులే కార‌ణ‌మ‌ని అప్ప‌డు రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ స‌హా ప‌లు వ‌ర్గాల నుంచి నిర‌స‌న వ్య‌క్త‌మైంది. మ‌రోవైపు, ప‌తంజ‌లి సంస్థ కూడా త‌మ ఉత్ప‌త్తుల ప్ర‌మోష‌న్ కోసం అలోప‌తి వైద్య విధానాన్ని అప‌హ‌స్యం చేస్తూ రూపొందించిన యాడ్స్‌పై కూడా తీవ్ర స్థాయిలో నిర‌స‌న‌, వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఈ నేప‌థ్యంలో భార‌త వైద్య మండ‌లి(Indian Medical Association -IMA) సుప్రీంకోర్టులో ఒక పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

SC serious on Baba Ramdev | కేంద్రానికి నోటీసులు

IMA దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై స్పందించాల‌ని సుప్రీంకోర్టు కేంద్ర ప్ర‌భుత్వానికి, ప‌తంజ‌లి సంస్థ‌కు నోటీసులు జారీ చేసింది. ఈ సంద‌ర్భంగా ఈ పిటిష‌న్‌ను విచారిస్తున్న ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప‌తంజ‌లి సంస్థ‌పై, ఆ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు బాబా రామ్‌దేవ్‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. `యోగాకు ప్రాచుర్యం క‌ల్పించినందుకు ఆయ‌నంటే మాకు గౌర‌వ‌మే. కానీ, ఇత‌ర విధానాల‌ను విమ‌ర్శించ‌కూడ‌దు క‌దా. ఆయ‌న వైద్య విధానం అన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుంద‌న్న గ్యారెంటీ ఏమ‌న్నా ఉందా?`` అంటూ జ‌స్టిస్ ర‌మ‌ణ ప్ర‌శ్నించారు. ప‌తంజ‌లి సంస్థ యాడ్స్‌ను ప్ర‌స్తావిస్తూ.. ``వైద్యులంద‌రూ హంత‌కులైన‌ట్లు, ఆ దూష‌ణ‌లేంటి? `` అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. డాక్ట‌ర్ల‌ను, ఇత‌ర వైద్య విధానాల‌ను దూషించ‌డం క‌రెక్ట్ కాదని స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం