తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dollar Rate Today : రూపాయి ఆల్‌టైమ్ రికార్డు.. 78.29కి పతనం

Dollar rate today : రూపాయి ఆల్‌టైమ్ రికార్డు.. 78.29కి పతనం

HT Telugu Desk HT Telugu

13 June 2022, 9:35 IST

    • రూపాయి మరోసారి జీవితకాలపు కనిష్టాన్ని నమోదు చేసింది. డాలరుతో పోల్చితే రూపాయి విలువ శుక్రవారం 77.93కు పడిపోగా, సోమవారం ఏకంగా 78.29కి జారుకుంది.
రూపాయి విలువలో భారీ పతనం
రూపాయి విలువలో భారీ పతనం (AFP)

రూపాయి విలువలో భారీ పతనం

రూపాయి విలువ మరోసారి జీవితకాలపు కనిష్టానికి పతనమైంది. సోమవారం ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో 36 పైసలు బలహీనపడి డాలరుతో పోలిస్తే ఒక డాలరుకు రూ. 78.29గా మారకం విలువగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

శుక్రవారం రోజే 19 పైసలు బలహీనపడి ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పిన రూపాయి డాలరుతో పోలిస్తే 77.93లకు పడిపోయింది. క్రూడాయిల్ ధరలు పెరగడం, ద్రవ్యోల్భణం రేట్లు పెరగడం, విదేశీ సంస్తాగత ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ల నుంచి నిధులు మళ్లించడం తదిర అంశాలు ఫారెక్స్ మార్కెట్లో సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి.

సోమవారం ఉదయం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ వద్ద రూపాయి విలువ ఏకంగా 78.29కి పడిపోయింది. అంటే క్రితం రోజు ముగింపు 77.93 తో పోలిస్తే 36 పైసలు బలహీనపడింది. 

సోమవారం దేశీయ మార్కెట్లు కూడా భారీ పతనాన్ని చవిచూస్తుండడంతో సాయంత్రానికి రూపాయి విలువ మరింత పతనమయ్యే అవకాశం కనిపిస్తోంది. గత కొద్ది నెలలుగా రూపాయి వరుస పతనం భారత ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతోంది. చమురు ధరలు విపరీతంగా పెరిగినందున, దీనికి విదేశీ మారక ద్రవ్యం చెల్లింపుల కారణంగా రూపాయి మరింత బలహీనపడుతూ వస్తోంది.

టాపిక్

తదుపరి వ్యాసం