తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rajya Sabha Election 2022 : రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ హవా.. ఠాక్రేకు 'మహా' షాక్!

Rajya Sabha Election 2022 : రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ హవా.. ఠాక్రేకు 'మహా' షాక్!

Sharath Chitturi HT Telugu

11 June 2022, 6:30 IST

    • Rajya Sabha election 2022 : రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా.. మూడింట్లో బీజేపీ హవా కనిపించింది.
రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ హవా.. ఠాక్రేకు 'మహా' షాక్!
రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ హవా.. ఠాక్రేకు 'మహా' షాక్! (HT_Print)

రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ హవా.. ఠాక్రేకు 'మహా' షాక్!

Rajya Sabha election 2022 : రాజ్యసభ ఎన్నికల్లోనూ తన జోరును కొనసాగించింది బీజేపీ. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో.. మూడింట్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఫలితంగా విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్​ అఘాఢి ప్రభుత్వానికి ఊహించని షాక్​ తగిలింది!

ట్రెండింగ్ వార్తలు

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

మొత్తం 16 రాష్ట్రాల్లోని.. 57 స్థానాలకు ఓటింగ్​ షెడ్యూల్​ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. అందులో 41 సీట్లలో పోటీ చేసిన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 16 సీట్లకు శుక్రవారం.. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఫలితాలు సైతం వెంటనే వెలువడ్డాయి.

మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్​, హరియాణాల్లో హోరాహోరీ పోరు సాగింది. ఒక పార్టీకి చెందిన వారు, ఇంకో పార్టీకి ఓటు వేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ.. హరియాణా, మహారాష్ట్రలో కౌంటింగ్​ ప్రక్రియకు ఆటంకం కలిగించారు.

‘మహా’ షాక్​..!

Rajya Sabha election result 2022 : మహారాష్ట్రలో మాత్రం.. ఠాక్రే ప్రభుత్వానికి 'మహా' షాక్​ తగిలిందనే చెప్పుకోవాలి. అక్కడ ఆరు సీట్లకు ఓటింగ్​ జరగ్గా.. మూడింట్లో బీజేపీ గెలిచింది. రానున్న ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలపై ఇది ప్రభావితం చూపించే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్రలో బీజేపీకి రెండు సీట్లు దక్కుతాయని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా మూడో సీటును కూడా దక్కించుకుంది కమలదళం. ఊహించని విధంగా ఆ పార్టీకి 10ఓట్లు ఎక్కువ పడ్డాయి!

హరియాణాలో కాంగ్రెస్​ ఖాతా తెరవలేదు! పోటీ చేసిన రెండింట్లో ఓడిపోయింది. బీజేపీతో పాటు కమలదళం మద్దతు పలికిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ గెలుపొందారు.

రాజస్థాన్​లో మాత్రం.. కాంగ్రెస్​ తన స్థానాన్ని నిలుపుకుంది. నాలుగు సీట్లలో మూడింట్లో విజయం సాధించింది. ఒక సీటు బీజేపీకి దక్కింది. రాజ్యసభ ఎన్నికల్లో.. కాంగ్రెస్​ అధికార పక్షంగా రంగంలోకి దిగిన ఏకైక రాష్ట్రం రాజస్థాన్​.

ఇక కర్ణాటకలో.. నాలుగు సీట్లకు పోటీ జరగ్గా.. అధికార బీజేపీ మూడిట్లో గెలుపొందింది. ఒకటి కాంగ్రెస్​కు దక్కింది.

తదుపరి వ్యాసం