Russia's nuclear threat: బెలారస్ లో రష్యా అణ్వాయుధాల మోహరింపు; శత్రుదేశాలకు హెచ్చరిక
17 June 2023, 16:43 IST
Russia's nuclear threat: మిత్రదేశం బెలారస్ లో తమ అణ్వాయుధాలను మోహరించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) వెల్లడించారు. ఇది తమ వ్యూహాత్మక ఎత్తుగడ అని వివరించారు. ఉక్రెయిన్ తో యుద్ధంలో ఉక్రెయిన్ (russia ukraine war) కు సహకరిస్తున్న అమెరికా, తదితర దేశాలకు ఇది ఒక హెచ్చరికగా భావిస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్
మిత్రదేశం బెలారస్ లో తమ అణ్వాయుధాలను (nuclear weapons) మోహరించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) వెల్లడించారు. ఇది తమ వ్యూహాత్మక ఎత్తుగడ అని వివరించారు. ఉక్రెయిన్ తో యుద్ధం (russia ukraine war) లో ఉక్రెయిన్ కు సహకరిస్తున్న అమెరికా (America), తదితర దేశాలకు ఇది ఒక హెచ్చరికగా భావిస్తున్నారు. బెలారస్ కు అణ్వాయుధాలను పంపించబోతున్నట్లు మూడు నెలల క్రితమే పుతిన్ ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రకటనను నిజం చేశారు. తొలి కన్సైన్ మెంట్ ను పంపించామని, ఈ సంవత్సరం చివర్లోగా మొత్తం కన్సైన్ మెంట్ ను డెలివరీ చేస్తామన్నారు.
అమెరికా కన్నా ఎక్కువే ఉన్నాయి..
‘‘అణ్వాయుధాలను రష్యా ప్రయోగించాలనుకోవడం లేదు. ప్రస్తుతం ఆ అవసరం కూడా రష్యాకు లేదు. రష్యా రక్షణ కోసం వ్యూహాత్మకంగా వాటిని సిద్ధం చేసుకుంటున్నాం’’ అని శుక్రవారం పుతిన్ స్పష్టం చేశారు. వ్యూహాత్మక అణ్వాయుధ నిల్వలను తగ్గించుకోవాలన్న అమెరికా అభ్యర్థనను తాము ఎన్నడో తోసిపుచ్చామన్నారు. ప్రస్తుతం తమ వద్ద అమెరికా, దాని మిత్ర దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాల కన్నా ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. రష్యా నుంచి అణ్వాయుధాలు బెలారస్ కు చేరుకున్నాయని బెలారస్ అధ్యక్షుడు కూడా నిర్ధారించారు.
అమెరికా స్పందన
బెలారస్ కు అణ్వాయుధాలను పంపించామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటనపై అమెరికా స్పందించింది. విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ స్పందిస్తూ.. ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. తమ అణ్వాయుధ మోహరింపుల్లో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులు చేయబోవడ లేదని వెల్లడించారు. ‘‘ రష్యా అణ్వాయుధాలను ప్రయోగిస్తుందని మేం భావించడం లేదు’’ అని బ్లింకెన్ వాషింగ్టన్ లో వ్యాఖ్యానించారు. బెలారస్ కు అణ్వాయుధాలను పంపించనున్నామని ఈ మార్చిలో పుతిన్ ప్రకటించారు. ఆ ప్రకటనను అమెరికా, యూరోప్ దేశాలు తీవ్రంగా ఖండించాయి.
టాపిక్