తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Russia Rebellion: ‘‘పుతిన్ తప్పు చేశాడు.. రష్యాకు త్వరలో కొత్త అధ్యక్షుడు’’: వాగ్నర్ గ్రూప్

Russia rebellion: ‘‘పుతిన్ తప్పు చేశాడు.. రష్యాకు త్వరలో కొత్త అధ్యక్షుడు’’: వాగ్నర్ గ్రూప్

HT Telugu Desk HT Telugu

24 June 2023, 14:16 IST

  • రష్యాలో పరిస్థితులు అనుక్షణం ఆందోళనకరంగా మారిపోతున్నాయి. రష్యా పై సొంత ప్రైవేటు మిలటరీ సైన్యం ‘వాగ్నర్ గ్రూప్ (Wagner group)’ తిరుగుబాటు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్
వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ (AP)

వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్

రష్యాలో పరిస్థితులు అనుక్షణం మారిపోతున్నాయి. రష్యా పై సొంత ప్రైవేటు మిలటరీ సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ తిరుగుబాటు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అనూహ్య తిరుగుబాటుపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తీవ్రంగా స్పందించారు. ప్రైవేటు సైన్యం తిరుగుబాటును కఠినంగా అణచివేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, వాగ్నర్ గ్రూప్ (Wagner group) కూడా అంతే దీటుగా స్పందించింది. తమ దళాలు మాస్కో దిశగా దూసుకుపోతున్నాయని, పుతిన్ పెద్ద తప్పు చేశారని, త్వరలోనే రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తాడని వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

‘వాగ్నర్’ స్వాధీనంలో రెండు రష్యా నగరాలు

రష్యా లోని రెండు కీలక నగరాలను స్వాధీనం చేసుకున్నామని వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ (Yevgeny Prigozhin) ప్రకటించారు. రష్యా మిలటరీకి చెందిన మూడు హెలీకాప్టర్లను కూల్చేశామని తెలిపారు. తమకు రష్యా నేషనల్ గార్డ్స్ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదన్నారు. తమ తదుపరి లక్ష్యం రష్యా మిలటరీ నాయకత్వాన్ని కూలదోయడమేనని స్పష్టం చేశారు.

దారుణమైన వెన్నుపోటు

వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ తిరుగుబాటు దారుణమైన వెన్నుపోటు, నమ్మకద్రోహం అని అభివర్ణించారు. ఆ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ రష్యాకు ద్రోహం చేశాడని ఆరోపించారు. ప్రిగోజిన్ వ్యక్తిగత స్వార్థం, స్వార్థ ప్రయోజనాలే ఈ నమ్మకద్రోహానికి కారణమన్నారు. ‘‘ఈ నమ్మకద్రోహానికి, మోసానికి పాల్పడిన వారు, వారికి సహకరించినవారు, ఈ తిరుగుబాటుకు ప్రణాళిక సిద్ధం చేసినవారు.. అందరికీ తగిన శిక్ష కచ్చితంగా పడుతుంది’’ అని మండిపడ్డారు. ’%ఒకవైపు రష్యా ఉక్రెయిన్ తో అత్యంత కఠినమైన యుద్ధం చేస్తోంది. పాశ్చాత్య దేశాలు తమ శక్తియుక్తులన్నీ ఒడ్డి మనల్ని నాశనం చేయాలని చూస్తున్నాయి. ఇదే సమయంలో సొంత మనుషులే ఈ తిరుగుబాటు చేసి, దేశానికి, దేశ ప్రజలకు ద్రోహం చేశారు. క్షమించరాని నేరం చేశారు. వారికి తగిన శిక్ష కచ్చితంగా ఉంటుంది’’ అని పుతిన్ పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం