తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pariksha Pe Charcha 2023: విద్యార్థులతో మాట్లాడనున్న ప్రధాని మోదీ.. పరీక్షలపై ఒత్తిడి పోగొట్టేందుకు: తేదీ ఇదే

Pariksha Pe Charcha 2023: విద్యార్థులతో మాట్లాడనున్న ప్రధాని మోదీ.. పరీక్షలపై ఒత్తిడి పోగొట్టేందుకు: తేదీ ఇదే

03 January 2023, 18:02 IST

    • Pariksha Pe Charcha 2023: ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చ’ తేదీ ఖరారైంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లతో మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. పరీక్షలు రాసే విద్యార్థులందరికీ సందేశమివ్వనున్నారు.
Pariksha Pe Charcha 2023: విద్యార్థులతో మాట్లాడనున్న ప్రధాని మోదీ
Pariksha Pe Charcha 2023: విద్యార్థులతో మాట్లాడనున్న ప్రధాని మోదీ (ANI)

Pariksha Pe Charcha 2023: విద్యార్థులతో మాట్లాడనున్న ప్రధాని మోదీ

Pariksha Pe Charcha 2023 Date: సాధారణంగా పరీక్షలంటే విద్యార్థుల్లో ఒత్తిడి ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ భయంతో ఉంటారు. ముఖ్యంగా వార్షిక పరీక్షల ముందు ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటారు. అందుకే పరీక్షల ముందు విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రతీ సంవత్సరం ‘పరీక్షా పే చర్చ’ నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఉండనుంది. ఈనెల 27వ తేదీన పరీక్షా పే చర్చ జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులతో ప్రధాని మాట్లాడతారు. విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పరీక్షా పే చర్చను నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఎల్.కే.అడ్వాణీ ఈ వ్యాఖ్యలు చేయలేదు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Pariksha Pe Charcha 2023: “2023 జనవరి 27న జరగనున్న పరీక్షా పే చర్చలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడతారు” అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. 2022 డిసెంబర్ 30లోగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఈ పరీక్ష పే చర్చలో పాల్గొనవచ్చు.

Pariksha Pe Charcha 2023 Date: సాధారణంగా పరీక్షలంటే విద్యార్థుల్లో ఒత్తిడి ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ భయంతో ఉంటారు. ముఖ్యంగా వార్షిక పరీక్షల ముందు ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటారు. అందుకే పరీక్షల ముందు విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రతీ సంవత్సరం ‘పరీక్షా పే చర్చ’ నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఉండనుంది. ఈనెల 27వ తేదీన పరీక్షా పే చర్చ జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులతో ప్రధాని మాట్లాడతారు. విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పరీక్షా పే చర్చను నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు ఇవే.

Pariksha Pe Charcha 2023: “2023 జనవరి 27న జరగనున్న పరీక్షా పే చర్చలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడతారు” అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. 2022 డిసెంబర్ 30లోగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఈ పరీక్ష పే చర్చలో పాల్గొనవచ్చు.

విద్యార్థులకు సలహాలు

2018 నుంచి ఈ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు రాయనున్న విద్యార్థులతో ప్రధాని మోదీ మాట్లాడతారు. వారిలో స్ఫూర్తి నింపేలా ప్రసంగిస్తారు. విద్యార్థుల్లో ఒత్తిడి, భయం పోయేలా సలహాలు ఇస్తారు. పరీక్షల కోసం కొన్ని చిట్కాలు కూడా ఇస్తారు. భవిష్యత్తు లక్ష్యాల గురించి అడుగుతారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పరీక్ష పే చర్చలో విద్యార్థులు.. ప్రధానిని ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. స్టూడెంట్ల సందేహాలకు ఆయన సమాధానాలు ఇస్తారు.

ఇక, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారు. పిల్లల లక్ష్యాలు, ప్రతిభ తెలుసుకొని ప్రోత్సహించేలా స్ఫూర్తినిస్తారు.

తదుపరి వ్యాసం