తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Man Kills Ex Wife : విడాకులపై 'పోస్ట్​' పెట్టిందని- మహిళను చంపేసిన మాజీ భర్త!

Man kills ex wife : విడాకులపై 'పోస్ట్​' పెట్టిందని- మహిళను చంపేసిన మాజీ భర్త!

Sharath Chitturi HT Telugu

24 July 2022, 15:37 IST

    • Man kills ex wife : ఆమెకు పెళ్లి జరిగి ఏడాది కూడా అవ్వలేదు. అప్పుడే విడాకులకు అప్లై చేసింది. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ పెట్టింది. అంతే.. కోపం పెంచుకున్న ఆ మహిళ మాజీ భర్త.. 100కిలోమీటర్లు ప్రయాణించి ఆమెను చంపేశాడు. అమెరికా చికాగోలో జరిగింది ఈ ఘటన.
తమ విడాకుల గురించి 'పోస్ట్​' పెట్టిందని.. మహిళను చంపేసిన మాజీ భర్త!
తమ విడాకుల గురించి 'పోస్ట్​' పెట్టిందని.. మహిళను చంపేసిన మాజీ భర్త! (HT Telugu)

తమ విడాకుల గురించి 'పోస్ట్​' పెట్టిందని.. మహిళను చంపేసిన మాజీ భర్త!

Man kills ex wife : అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్​ సంతతికి చెందిన మహిళను ఆమె మాజీ భర్త హత్య చేశాడు. తమ విడాకులపై సామాజిక మాధ్యమాల్లో ఆ మహిళ పోస్టులు పెట్టడంతో కోపం తెచ్చుకున్న ఆ పాకిస్థాన్​ సంతతి వ్యక్తి.. ఈ దారుణానికి ఒడిగట్టాడు.

100కిలోమీటర్లు ప్రయాణించి..

29ఏళ్ల సానియా ఖాన్​.. అమెరికా ఓ ప్రొఫెషనల్​ ఫొటోగ్రాఫర్​. కాగా.. పెళ్లి జరిగి ఏడాది తిరగకుండానే ఆమె తన భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి చికాగోలో నివాసముంటోంది.

కొన్ని రోజుల క్రితం.. తన జీవితంలో విడాకుల విషయంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టింది. విడాకులు, అనంతరం తన జీవితంలో వచ్చిన మార్పులు, ఆ డిప్రెషన్​ను తాను ఎలా బయటపడిందో వివరించింది. 'దక్షిణాసియా మహిళకు డివోర్స్​ అంటే పెద్ద విషయం. జీవితంలో విఫలమయ్యాం అన్న భావన కలుగుతుంది. మనకి ఎమోషనల్​ సపోర్ట్​ కూడా ఉండదు,' అని ఆమె రాసుకొచ్చింది.

ఆ పోస్టులపై కోపం తెచ్చుకున్న సానియా ఖాన్​ మాజీ భర్త రహీల్​ అహ్మెద్​.. జార్జియా నుంచి 100కిలోమీటర్లు ప్రయాణించి గత సోమవారం చికాగోకు వెళ్లాడు. సానియా ఇంటికి వెళ్లి.. కత్తితో ఆమెను పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తనని తాను పొడుచుకున్నాడు. ఇంట్లో నుంచి అరుపుల శబ్దం వినిపించడంతో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వచ్చేసరికి.. సానియా ఖాన్​ ప్రాణాలు కోల్పోయింది. కాగా.. రహీల్​ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ అతను కూడా మరణించాడు. ఘటనాస్థలం నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటన చికాగోవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సానియా ఖాన్​కు మద్దతుగా అక్కడి ప్రజలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరుతో పోస్టులు పెడుతున్నారు.

<p>సానియా ఖాన్​</p>

టాపిక్

తదుపరి వ్యాసం