తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Niacl Recruitment: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో ఏఓ పోస్ట్ లకు నోటిఫికేషన్

NIACL recruitment: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో ఏఓ పోస్ట్ లకు నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu

28 July 2023, 19:41 IST

  • NIACL recruitment: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. వీటిలో జనరలిస్ట్ ఏఓ, స్పెషలిస్ట్ ఏఓ పోస్ట్ లున్నాయి. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NIACL recruitment: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. వీటిలో జనరలిస్ట్ ఏఓ, స్పెషలిస్ట్ ఏఓ పోస్ట్ లున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

Indian students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు

మొత్తం 450 పోస్ట్ లు..

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 450 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఇందులో జనరలిస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO), స్పెషలిస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) పోస్ట్ లున్నాయి. ఇవి స్కేల్ 1 పోస్ట్ లు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో www.newindia.co.in వెబ్ సైట్ ద్వారా ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఆగస్ట్ 19.

ఎంపిక ప్రక్రియ..

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మొదట ఫేజ్ 1 ఆబ్జెక్టివ్ తరహా ఆన్ లైన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఆ పరీక్ష సెప్టెంబర్ 9వ తేదీన ఉంటుంది. ఆ తరువాత ఫేజ్ 2 ఆన్ లైన్ పరీక్ష (ఆబ్జెక్టివ్ + డిస్క్రిప్టివ్) రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష అక్టోబర్ 8 వ తేదీన ఉంటుంది.

vacancy details: వేకెన్సీ వివరాలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 450 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఇందులో జనరలిస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO), స్పెషలిస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) పోస్ట్ లున్నాయి. ఇవి స్కేల్ 1 పోస్ట్ లు. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వయో పరిమితి రిజర్వేషన్లు వర్తిస్తాయి. అభ్యర్థులు రూ. 850 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులు రూ. 100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.

how to apply: అప్లై చేయడం ఎలా?

  • అభ్యర్థులు ముందుగా www.newindia.co.in వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపిస్తున్న recruitment section లింక్ పై క్లిక్ చేయాలి.
  • Apply online పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.

తదుపరి వ్యాసం