తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Epfo Payroll Data : దేశంలో తగ్గుతున్న నిరుద్యోగ రేటు.. పెరిగిన ఈపీఎఫ్​ఓ ఖాతాలు!

EPFO payroll data : దేశంలో తగ్గుతున్న నిరుద్యోగ రేటు.. పెరిగిన ఈపీఎఫ్​ఓ ఖాతాలు!

Sharath Chitturi HT Telugu

17 September 2022, 13:24 IST

    • EPFO payroll data : దేశంలో క్యూ 1లో ఈపీఎఫ్​ ఖాతాలు రెట్టింపు అయ్యాయి. దీనితో పాటు దేశం అన్ని విధాలుగా వృద్ధిచెందుతోందని కేంద్రం ఆర్థిక శాఖ నివేదికను విడుదల చేసింది.
దేశంలో తగ్గుతున్న నిరుద్యోగ రేటు.. పెరిగిన ఈపీఎఫ్​ఓ ఖాతాలు!
దేశంలో తగ్గుతున్న నిరుద్యోగ రేటు.. పెరిగిన ఈపీఎఫ్​ఓ ఖాతాలు! (REUTERS)

దేశంలో తగ్గుతున్న నిరుద్యోగ రేటు.. పెరిగిన ఈపీఎఫ్​ఓ ఖాతాలు!

EPFO payroll data : నెలవారీ ఆర్థిక నివేదికను శనివారం విడుదల చేసింది కేంద్ర ఆర్థికశాఖ. ఏప్రిల్​- జూన్​ త్రైమాసికంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన 5వ అతిపెద్ద దేశంగా భారత్​ నిలిచిందని పేర్కొంది. అదే సమయంలో.. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఈపీఎఫ్​ఓ ఖాతాలు రెట్టింపు అయినట్టు వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

Uber ride horror: కారులో ఉబర్ డ్రైవర్ హస్తప్రయోగం; భయాందోళనలకు గురైన మహిళ

కాగా.. దేశంలో నిరుద్యోగం వరుసగా 4వ త్రైమాసికంలోనూ తగ్గిందని స్పష్టం చేసింది కేంద్ర ఆర్థికశాఖ నివేదిక. పట్టణాల్లో నిరుద్యోగం 7.6శాతంగా ఉందని వివరించింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు నెమ్మదిస్తున్నప్పటికీ.. ఇండియాలో ఎగుమతులు ఈ త్రైమాసికంలో పెరిగాయి. భారతీయ వస్తువులకు పెరుగుతున్న డిమాండ్​ను ఇది సూచిస్తుందని, జులై- సెప్టెంబర్​ త్రైమాసికంలోనూ ఇది కొనసాగుతుందని నివేదిక స్పష్టం చేసింది.

Indian economy : భారత ఆర్థిక వ్యవస్థ.. కొవిడ్​, ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధాన్ని తట్టుకుని నిలబడిందని నివేదిక వివరించింది. ఈ క్రమంలోనే యూకేని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా అవతరించిందని తెలిపింది. 2022-23 క్యూ1 వాస్తవిక జీడీపీ దాదాపు 4శాతంగా ఉందని.. 2019-2020 నాటి కన్నా ఇది ఎక్కువని వెల్లడించింది.

అయితే.. 2022-23 ఆర్థిక ఏడాదిలో భారత దేశ జీడీపీ 7.2శాతం వృద్ధిచెందుతుందని ఆర్​బీఐ అంచనా వేసింది. ఇది సాధించాలంటే.. రానున్న మూడు త్రైమాసికాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ సగటున 5.4శాతం వృద్ధిచెందాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం