తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Meal With Mom | ఆహా.. హోలీకి కేంద్రం సూపర్ కాన్సెప్ట్.. మీ ఫొటోలు పంపొచ్చు

Meal With Mom | ఆహా.. హోలీకి కేంద్రం సూపర్ కాన్సెప్ట్.. మీ ఫొటోలు పంపొచ్చు

HT Telugu Desk HT Telugu

17 March 2022, 21:11 IST

    • హోలీ వేడుకలు కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అలా పాటించి.. ఆ ఫొటోలను షేర్ చేయాలని చెప్పింది. వాటిని కేంద్ర ప్రభుత్వ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేస్తామని చెప్పింది.
హోలీకి కేంద్రం కొత్త కాన్సెప్ట్
హోలీకి కేంద్రం కొత్త కాన్సెప్ట్ (twitter)

హోలీకి కేంద్రం కొత్త కాన్సెప్ట్

ఇండియాలో హోలీ పండగ అంటే.. ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతా కలిసి జరుపుకొంటారు. అయితే ఈసారి కేంద్రం ఓ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. హోలీ వేడుకల రోజున మీ తల్లితో భోజనం చేసి.. పండుగ జరుపుకోవాలని చెప్పింది. అయితే ఆ ఫోటోలను..#MaaKeSangKhana, #MealWithMom పేరుతో ట్యాగ్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని చెప్పింది. వాటిలో కొన్నింటిని భారత ప్రభుత్వం తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేస్తానని తెలిపింది.

రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు హోలీ వేడుకలు దూరంగా ఉన్నారు. అంతగా ఉత్సహం చూపలేదు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో.. హోలీ సంబరాలు జరుపుకోవాలనుకుంటున్నారు. అయితే కొవిడ్ పూర్తిగా పోలేదుకాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

తదుపరి వ్యాసం