తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Liz Truss Announces Her Resignation: బ్రిటన్ పీఎం పదవికి లిజ్ ట్రస్ రాజీనామా

Liz Truss announces her resignation: బ్రిటన్ పీఎం పదవికి లిజ్ ట్రస్ రాజీనామా

HT Telugu Desk HT Telugu

20 October 2022, 18:25 IST

    • Liz Truss announces her resignation: ఆరు వారాల క్రితమే బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన కన్సర్వేటివ్ పార్టీ నేత లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు.
బ్రిటన్ పీఎం పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్
బ్రిటన్ పీఎం పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్ (AP)

బ్రిటన్ పీఎం పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్

Liz Truss announces her resignation: హోరాహోరీ ప్రచారం అనంతరం, భారత సంతతికి చెందిన రుషి సునక్ ను ఓడించి, బ్రిటన్ పీఎ పదవిని చేపట్టిన లిజ్ ట్రస్ ఆరు వారాలు కూడా గడవకముందే, ఆ పదవికి రాజీనామా చేశారు.

Liz Truss announces her resignation: రాజకీయ, ఆర్థిక సంక్షోభం

బ్రిటన్ ప్రస్తుతం అతిపెద్ద రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా నేపథ్యంలో అది మరింత తీవ్రమైంది. ఆ తరువాత, అధికార కన్సర్వేటివ్ పార్టీలో ప్రధాని పదవి కోసం భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ , లిజ్ ట్రస్ ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. తొలి రౌండ్లలో విజయం సాధించినప్పటికీ.. చివరి కీలక రౌండ్ అయిన పార్టీ డెలిగేట్స్ ఓట్లను సాధించడంలో సునక్ విఫలమయ్యారు. దాంతో, లిజ్ ట్రస్ బ్రిటన్ పీఎంగా బాధ్యతలు చేపట్టారు.

Liz Truss announces her resignation: తప్పుడు నిర్ణయాలు

ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిననాటి నుంచి లిజ్ ట్రస్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆమె అమలు చేసిన ఆర్థిక నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. టాక్స్ కట్ పాలసీ పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యింది. దాంతో, కొన్ని నిర్ణయాలను ఆమె అకస్మాత్తుగా వెనక్కు తీసుకుంది. దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమైంది.

Liz Truss announces her resignation: మంత్రుల రాజీనామా

మరోవైపు, ఆర్థిక మంత్రిని లిజ్ ట్రస్ స్వయంగా పదవి నుంచి తొలగించగా, హోం మంత్రి స్యూలా బ్రేవర్మన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో, ఆమెపై పీఎం పదవికి రాజీనామా చేయాలన్న ఒత్తిళ్లు పెరిగాయి. దాంతో, గురువారం ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

తదుపరి వ్యాసం