తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lic Share Price : రూ. 226 డిస్కౌంట్‌‌లో ఎల్ఐసీ షేరు..

LIC share price : రూ. 226 డిస్కౌంట్‌‌లో ఎల్ఐసీ షేరు..

HT Telugu Desk HT Telugu

09 June 2022, 13:50 IST

    • ఎల్ఐసీ ఐపీఓ సమయంలో రూ. 949కి ఒక్కొక్క షేర్ అలాట్ అయ్యింది. ఆ ధరతో పోలిస్తే ఇప్పుడు దాదాపు 25 శాతం పడిపోయి రూ. 226ల డిస్కౌంట్‌తో లభిస్తోంది. 
స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు చవిచూస్తున్న ఎల్ఐసీ స్టాక్
స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు చవిచూస్తున్న ఎల్ఐసీ స్టాక్ (REUTERS)

స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు చవిచూస్తున్న ఎల్ఐసీ స్టాక్

ముంబై,  జూన్ 9: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) షేర్ ధర గురువారం కొత్త రికార్డు కనిష్ట స్థాయి రూ. 723.70కి పడిపోయింది, ఇది దాని ఐపీఓ ఇష్యూ ధర రూ. 949తో పోలిస్తే దాదాపు 25 శాతం తగ్గింది. అంటే సుమారు రూ. 226 డిస్కౌంట్‌తో లభిస్తున్నట్టు లెక్క.

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

బాంబే స్టాక్ఎక్స్ఛేంజీలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేరు 1.83 శాతం క్షీణించి మధ్యాహ్నం 1.37 గంటలకు రూ. 724.50 వద్ద ట్రేడవుతోంది. దాని క్రితం రోజు ముగింపు రూ. 738 వద్ద ఉంది. ఇంట్రా-డేలో స్క్రిప్ రికార్డు కనిష్ట స్థాయి రూ. 723.70కి చేరుకుంది.

మే 17న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అయినప్పటి నుంచి ఎల్‌ఐసీ షేరు ధర భారీగా పడిపోయింది. ఎల్‌ఐసీ షేర్లను ఇన్వెస్టర్లకు ఒక్కొక్కటి రూ. 949 చొప్పున కేటాయించారు. 

దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ మార్కెట్ విలువలో రోజూ కోత పడుతోంది. ఇష్యూ ధర రూ. 949 వద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,00,242 కోట్లుగా ఉంది. గురువారం ఎల్‌ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 4.6 లక్షల కోట్లకు పడిపోయింది.

లిస్టింగ్ అయిన ఒక నెలలోపే ఎల్ఐసీ మార్కెట్ విలువలో దాదాపు నాలుగింట ఒక వంతు తుడిచిపెట్టుకుపోయింది.

లిస్టింగ్ అయినప్పటి నుండి ఈ స్క్రిప్ నాలుగు సెషన్లలోనే సానుకూలంగా ముగిసింది. మిగిలిన రోజుల్లో అమ్మకాల ఒత్తిడికి గురైంది. మే 4 నుండి మే 9 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచినప్పడు ఎల్ఐసీ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ 2.95 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది.

ప్రభుత్వ యాజమాన్యంలోని ఎల్ఐసీ భారతదేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ. మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత పాలసీలలో ఎల్ఐసీ మార్కెట్ వాటా 74.60 శాతంగా ఉంది. గ్రూప్ వ్యాపారంలో మార్చి 31, 2022తో ముగిసిన సంవత్సరంలో మార్కెట్ వాటా 89.07 శాతంగా ఉంది. మొదటి సంవత్సరం ప్రీమియం వాటా ప్రకారం 76.16 శాతంగా ఉంది.

మిశ్రమ మొదటి సంవత్సరం ప్రీమియం ఆదాయం పరంగా చూస్తే 31 మార్చి 2022 చివరి నాటికి ఎల్ఐసీ మార్కెట్ వాటా 63.25 శాతంగా ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం